Kurnool : కర్నూలులో ఘోర రోడ్డు ప్రమాదం.. 8మంది మృతి
Kurnool : ఆంధ్రప్రదేశ్ జిల్లా, కర్నూలులో ఘొర రోడ్డు ప్రమాదం వెలుగు చూసింది.
eight members died in road accident at kurnool
Kurnool : దేశంలో రోడ్డు ప్రమాదాలు నిత్యకృత్యమయ్యాయి. ఇంటి నుంచి బయటకు వెళ్లిన వారు.. క్షేమంగా తిరిగి చేరుకునే వరకు నమ్మకం లేకుండా పోతుంది. తాజాగా కర్నూలు జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం వెలుగు చూసింది. ఎనిమిది మంది అక్కడికక్కడే చనిపోయారు. గురువారం తెల్లవారుజామున ఈ ప్రమాదం జరిగింది. దీని గురించి తెలుసుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకున్నారు.
పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. మంత్రాలయం మండలం చిలకలడోన వద్ద ఈ ప్రమాదం చోటుచేసుకుంది. ప్రయాణికులతో వెళ్తున్న బొలెరో వాహనం-రెడీమిక్స్ లారీ రెండూ ఢీకొన్నాయి. ఈ ఘటనలో 8 మంది మరణించగా.. 12 మందికి గాయాలయ్యాయి. క్షతగాత్రులను ఎమ్మిగనూరులోని ఆస్పత్రికి తరలించారు. ఘటనాస్థలంలోనే ఐదుగురు చనిపోగా.. ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మరో ముగ్గురు చనిపోయారు. చనిపోయిన వారిలో ఐదుగురు మహిళలు, ఒక బాలిక ఉన్నారు.
ప్రమాదంలో మరణించిన వారి వివరాలకు వస్తే.. వీరంతా కర్ణాటకలోని చిక్కమగళూరుకు చెందిన భక్తులు. వీరు గురువారం మంత్రాలయంలోని శ్రీరాఘవేంద్రస్వామి దర్శించుకోవడానికి వెళ్తుండగా ఈ ప్రమాదం జరిగింది. ప్రమాదం గురించి తెలుసుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలు ప్రారంభించారు.
