ఏపీలో గెలుపు ఆ పార్టీదే..! ఎగ్జిట్ పోల్స్ ఫలితాలు విడుదల..
కొన్ని ప్రముఖ సంస్థల సర్వేల అంచనాలు దాదాపుగా ఎన్నికల ఫలితాలతో సరిపోలిన సందర్భాలు ఉన్నాయి. అందుకే, ఇప్పుడు దేశంలో ఎగ్జిట్ పోల్స్ పైనే అందరి దృష్టి ఉంది.

Ap Exit Poll Results : ఏపీ ఎన్నికల ఫలితాలపై తీవ్ర ఉత్కంఠ నెలకొంది. ఎన్నడూ లేని విధంగా ఈసారి ఏపీలో ఎన్నికలు హోరాహోరిగా జరిగాయి. గెలుపుపై అటు అధికార పక్షం నేతలు, ఇటు కూటమి నేతలు ఫుల్ కాన్ఫిడెంట్ గా ఉన్నారు. మరోసారి అధికారం మాదే అని వైసీపీ నాయకులు, ఈసారి విజయం పక్కా అని కూటమి నేతలు ధీమా వ్యక్తం చేస్తున్నారు. ఎవరి అంచనాలు నిజం కానున్నాయి? అన్నది జూన్ 4న తేలనుంది.
కాగా, అందరి దృష్టి ఇప్పుడు ఎగ్జిట్ పోల్స్ పైనే ఉంది. ఎగ్జిట్ పోల్స్ అంచనాలు ఏ విధంగా ఉన్నాయి? ఏ సర్వే సంస్థ ఏం చెబుతోంది? అధికారం ఎవరికి దక్కనుంది? అనేది హాట్ టాపిక్ గా మారింది. ఈ క్రమంలో ఎగ్జిట్ పోల్స్ వచ్చేశాయి. సంస్థల వారిగా ఎగ్జిట్ పోల్స్ ఈ విధంగా ఉన్నాయి..
2024 సార్వత్రిక ఎన్నికల ఫలితాలను అంచనా వేసే ఎగ్జిట్ పోల్స్ ను సర్వే ఏజెన్సీలు ప్రకటించాయి. లోక్ సభతో పాటు అసెంబ్లీ ఎన్నికల ఫలితాల అంచనాలను వెల్లడించాయి. కొన్ని ప్రముఖ సంస్థల సర్వేల అంచనాలు దాదాపుగా ఎన్నికల ఫలితాలతో సరిపోలిన సందర్భాలు ఉన్నాయి. అందుకే, ఇప్పుడు దేశంలో ఎగ్జిట్ పోల్స్ పైనే అందరి దృష్టి ఉంది.
సర్వే సంస్థ – RING2POLL
అసెంబ్లీ
కూటమి – 115 సీట్లు
వైసీపీ – 60 సీట్లు
పార్లమెంట్
కూటమి – 14-17
వైసీపీ – 8-11
సర్వే సంస్థ – National Family Opinion Pvt Ltd
అసెంబ్లీ
టీడీపీ కూటమి – 104 – 110
వైసీపీ – 65 – 71
పార్లమెంట్
టీడీపీ కూటమి – 15-18
వైసీపీ – 7-10
సర్వే సంస్థ – SAS Group (Sri Atma Sakshi Group)
అసెంబ్లీ
టీడీపీ కూటమి – 59-77
వైసీపీ – 98-116
పార్లమెంట్
టీడీపీ కూటమి – 8
వైపీపీ – 16
సర్వే సంస్థ – Q MEGA
అసెంబ్లీ
టీడీపీ కూటమి – 50-60
వైసీపీ – 120
పార్లమెంట్
టీడీపీ కూటమి- 01-05
వైసీపీ – 20-24
సర్వే సంస్థ – HMR
అసెంబ్లీ
టీడీపీ కూటమి – 73-83
వైసీపీ – 91-101
పార్లమెంట్
టీడీపీ కూటమి – 08-12
వైసీపీ – 13-17
సర్వే సంస్థ – NDT
అసెంబ్లీ
టీడీపీ కూటమి – 108-126
వైసీపీ – 49-69
సర్వే సంస్థ – AP Connect
అసెంబ్లీ
టీడీపీ కూటమి – 131
వైసీపీ – 44
సర్వే సంస్థ – POLL PULSE
అసెంబ్లీ
టీడీపీ కూటమి – 108-116
వైసీపీ – 48-56
పార్లమెంట్
టీడీపీ కూటమి – 20
వైసీపీ – 05
సర్వే సంస్థ – PEOPLE PULSE
అసెంబ్లీ
టీడీపీ కూటమి – 111-135
వైసీపీ – 45-60
పార్లమెంట్
టీడీపీ కూటమి – 20-22
వైసీపీ – 3-5
సర్వే సంస్థ – INDIA TV AP
పార్లమెంట్
టీడీపీ కూటమి – 20-22
వైసీపీ – 3-5