Nellore, Srikakulam: నెల్లూరు, శ్రీకాకుళంలో ఎన్నికలు
రాష్ట్రంలో ఎన్నికలు జరగకుండా మిగిలిపోయిన పలు పట్టణ, స్థానిక సంస్థలకు ఎన్నికలు నిర్వహించేందుకు రాష్ట్ర ఎన్నికల సంఘం సమాయత్తమైంది.

Nellore
Elections in Nellore And Srikakulam: రాష్ట్రంలో ఎన్నికలు జరగకుండా మిగిలిపోయిన పలు పట్టణ, స్థానిక సంస్థలకు ఎన్నికలు నిర్వహించేందుకు రాష్ట్ర ఎన్నికల సంఘం సమాయత్తమైంది.
శ్రీకాకుళం, నెల్లూరు మున్సిపల్ కార్పొరేషన్లతో పాటు 11 మున్సిపాలిటీల్లో ఎన్నికల నిర్వహణకు ఇబ్బందులు లేవని అధికారులు ఎస్‌ఈసీ నీలం సాహ్ని దృష్టికి తీసుకుని రాగా.. ఎన్నికలు నిర్వహించేందుకు అధికారులు ఏర్పాట్లు చేసుకోవాలని సూచించారు. కోర్టు కేసులు లేని ప్రాంతాల్లో సాంకేతికంగా ఇబ్బందుల్లేని చోట ఎన్నికలను నిర్వహించేందుకు రాష్ట్ర ఎన్నికల సంఘం సిద్ధం అవుతోంది.