Electric Shock : విజయనగరం జిల్లాలో ఎస్సీ బాలుర హాస్టల్‎లో విద్యుత్ షాక్

విజయనగరం జిల్లాలో వెంకటాపురం ఎస్సీ బాలుర కాలేజీ హాస్టల్‎లో విద్యార్థి విద్యుత్ షాక్ కు గురయ్యాడు. మెట్ల పక్కన ఉన్న విద్యుత్ వైర్లు తాకడంతో విద్యార్థికి షాక్ కొట్టింది.

Electric Shock : విజయనగరం జిల్లాలో ఎస్సీ బాలుర హాస్టల్‎లో విద్యుత్ షాక్

Updated On : November 20, 2022 / 11:47 PM IST

Electric Shock : విజయనగరం జిల్లాలో వెంకటాపురం ఎస్సీ బాలుర కాలేజీ హాస్టల్‎లో విద్యార్థి విద్యుత్ షాక్ కు గురయ్యాడు. మెట్ల పక్కన ఉన్న విద్యుత్ వైర్లు తాకడంతో విద్యార్థికి షాక్ కొట్టింది. దీంతో అతడు రెండో ఫ్లోర్ నుంచి కిందకు పడిపోయాడు. విద్యార్థికి తీవ్ర గాయాలయ్యాయి. చికిత్స కోసం బాధితుడిని విశాఖ కేజీహెచ్ కు తరలించారు.

మెట్ల పక్కనే విద్యుత్ వైర్లు ప్రమాదకరంగా ఉన్నాయని అధికారులకు ఎన్నిసార్లు చెప్పినా పట్టించుకోలేదని విద్యార్థులు వాపోయారు. విద్యుత్ షాక్ కొట్టి ఓ విద్యార్థి తీవ్ర గాయాల పాలవడం కలకలం రేపింది. ఈ ఘటనతో ఇతర విద్యార్థులు భయాందోళన చెందుతున్నారు. అటు తల్లిదండ్రులు కూడా కంగారు పడుతున్నారు. ఇప్పటికైనా అధికారులు స్పందించాలని, మెట్ల పక్కనే ప్రమాదకరంగా మారిన విద్యుత్ వైర్లను తొలగించాలని డిమాండ్ చేస్తున్నారు.