Elephants: బీభత్సం సృష్టిస్తోన్న ఏనుగులను కుప్పం అటవీ ప్రాంతం వైపునకు తరలిస్తున్న అధికారులు.. అప్రమత్తంగా ఉండాలని సూచన
Elephants: కృష్ణగిరి పరిసర ప్రాంతాల్లో ఇప్పటికే నలుగురి ప్రాణాలు తీశాయి ఈ రెండు ఏనుగులు.

Elephants
Elephants: చిత్తూరు జిల్లా కుప్పం (Kuppam) సరిహద్దు ప్రాంతంలో రెండు రోజుల నుంచి బీభత్సం సృష్టిస్తోన్న ఏనుగులపై అధికారులు చర్యలు తీసుకుంటున్నారు. తమిళనాడు కృష్ణగిరి వద్ద మనుషులపై దాడులు చేస్తున్న రెండు ఏనుగులను కుప్పం అటవీ ప్రాంతం వైపునకు మళ్లిస్తున్నారు తమిళనాడు ఫారెస్ట్ అధికారులు.
రెండు రోజులుగా కృష్ణగిరి చెరువులో ఏనుగులు తిష్ట వేశాయి. చెరువులో చేపలు పట్టేందుకు వెళ్లిన పెరుమాళ్ ను ఇవాళ ఏనుగులు తొక్కి చంపాయి. ఏనుగుల దాడిలో మరో వ్యక్తికి గాయాలయ్యాయి. కృష్ణగిరి పరిసర ప్రాంతాల్లో ఇప్పటికే నలుగురి ప్రాణాలు తీశాయి ఈ రెండు ఏనుగులు.
ఆంధ్ర-తమిళనాడు సరిహద్దులోని కుప్పం మండలం నడుమూరు అటవీ ప్రాంతం గుండా ఏనుగులు కుప్పం వైపునకు వచ్చే అవకాశం ఉండడంతో కుప్పం అటవీ సిబ్బంది అప్రమత్తమయ్యారు. ఏనుగులు కుప్పం వైపు రాకుండా నడుమూరు ఫారెస్ట్ లో మూడు టీములను ఏర్పాటు చేశారు. కుప్పం సరిహద్దు ప్రాంత ప్రజలు అప్రమత్తంగా ఉండాలని కుప్పం ఎఫ్ఆర్ఓ చంద్రశేఖర్ రెడ్డి సూచించారు.