ప్రాణం తీసిన వివాహేతర సంబంధం-బలవన్మరణానికి కారణమైన వాట్సప్ స్టేటస్

ప్రాణం తీసిన వివాహేతర సంబంధం-బలవన్మరణానికి కారణమైన వాట్సప్ స్టేటస్

Updated On : December 20, 2020 / 12:33 PM IST

event dancer ends life in Vijayawada : విజయవాడ వాంబే కాలనీలో బలవ్మరణానికి పాల్పడిని ఈవెంట్ డ్యాన్సర్ గాయత్రి వ్యవహారంలో అక్రమ సంబంధమే కారణమని పోలీసులు భావిస్తున్నారు. తన భర్తతో తోటి డ్యాన్సర్ దిగిన ఫోటోను, వాట్సప్ స్టేటస్ గా పెట్టుకోవటంతో మొదలైన గొడవ మహిళ ప్రాణం మీదకు తెచ్చింది.

విజయవాడ వాంబే కాలనీలో నివసించే గాయత్రి ఈవెంట్లలో డ్యాన్సర్ గా పని చేస్తోంది. కొన్నాళ్ల క్రితం సంతోష్ అనే వ్యక్తిని ప్రేమించి పెళ్లి చేసుకుంది. వారికి ఇద్దరు కుమారులు. వాంబే కాలనీకే చెందిన బన్నీ డ్యాన్స్ ట్రూప్ లో గాయత్రి డ్యాన్సర్ గా పని చేస్తోంది. అదే గ్రూపులో బన్నీ భార్య నీలిమ కూడా డ్యాన్సర్ గా పని చేస్తోంది. అందరూ కలిసి కట్టుగా స్నేహంగా ఉండేవాళ్లు. కార్యక్రమాలకు హాజరవుతూ ఉండేవాళ్లు. ఈ క్రమంలో బన్నీ, గాయత్రి మధ్య వివాహేతర సంబంధం ఏర్పడింది.
vja dancer gayatri
తాజగా బన్నీతో దిగిన ఫోటోను గాయత్రీ తన వాట్సప్ స్టేటస్ లో పెట్టుకోవటంతో నీలిమకు కోపం వచ్చింది. ఈవిషయమై మాట్లాడేందుకు నీలిమ గాయత్రి ఇంటికి వచ్చింది. ఈ సమయంలో వారిద్దరి మధ్య వాగ్వాదం జరిగింది. నీలిమ వెళ్లిన కాసేపటి తర్వాత గాయత్రి తన ఇంటిలో చున్నీతో ఫ్యాన్ కు ఉరి వేసుకుని తనువు చాలించింది. ఆమె ఇంటికి సమీపంలోని తల్లి,తండ్రులు కూడా నివసిస్తున్నారు.

నీలిమ ఇంటికి వచ్చిన సమయంలో గాయత్రి భర్త సతీష్ పిల్లలను తీసుకుని బయటకు వెళ్లినట్లు తెలిసింది. అతను ఇంటికి తిరిగి వచ్చే సరికి ఇంటి తలుపులు వేసి ఉండటంతో గాయత్రి తన పుట్టింటికి వెళ్లిందేమోనని అక్కడ ఎంక్వయిరీ చేశాడు. అక్కడ లేకపోయే సరికి తలుపులు విరగొట్టి చూడగా చున్నీతో ఫ్యాన్ కు ఉరివేసుకుని గాయత్రి విగతజీవిగా కనిపించింది.

నీలిమ ఇంటికి వచ్చివెళ్లిన కొద్ది సేపటికే గాయత్రి ఈ అఘాయిత్యం చేసుకోవటానికి నీలిమే కారణమని ప్రచారం జరిగింది. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. గాయత్రి, నీలిమల కాల్ డేటాను పరిశీలిస్తున్నారు. మరో వైపు బన్నీ సెల్ ఫోన్ లోని ఫోటోలు, కాల్ డేటాను కూడా పరిశీలించి అన్నీ కోణాల్లో కేసును దర్యాప్తు చేస్తున్నారు. కాగా….తాను గాయత్రి వద్దకు వెళ్లిన మాట వాస్తవమేనని, తాము కేవలం డ్యాన్స్ ఈవెంట్ల గురించి మాత్రమే మాట్లాడుకున్నామని నీలిమ చెపుతోంది.