మూడేళ్లలో ఎన్నికలొస్తాయ్, మళ్లీ మా దగ్గరే పని చెయ్యాలి : పోలీసులకు మాజీమంత్రి వార్నింగ్

  • Published By: veegamteam ,Published On : September 4, 2019 / 06:52 AM IST
మూడేళ్లలో ఎన్నికలొస్తాయ్, మళ్లీ మా దగ్గరే పని చెయ్యాలి : పోలీసులకు మాజీమంత్రి వార్నింగ్

Updated On : September 4, 2019 / 6:52 AM IST

టీడీపీ నేత.. మాజీ మంత్రి అయ్యన్న పాత్రుడు ఏపీ పోలీసులకు వార్నింగ్ ఇచ్చారు. మరో మూడేళ్లలో ఎన్నికల్లో రానున్నాయని జోస్యం చెప్పిన అయ్యన్న ఎన్నికల్లో అధికారంలోకి వచ్చేది కచ్చితంగా టీడీపీయేనని ధీమా వ్యక్తంచేశారు. అప్పుడు పోలీసులు తిరిగి మా దగ్గరే పని చేయ్యాలని కాబట్టి పోలీసులు జాగ్రత్తగా వ్యవహరించాలని అయ్యన్న హెచ్చరించారు.

పోలీసులు టీడీపీ నేతల పట్ల వ్యవహరిస్తున్న తీరు సరైంది కాదన్నారు. ఇదంతా సీఎం జగన్ ఆదేశాల మేరకే జరుగుతోందని ఆరోపించారు. వచ్చే ఎన్నికల్లో తామే అధికారంలోకి వస్తామని..అది గుర్తుంచుకుని పోలీసులు బాధ్యతగా వ్యవహరిస్తే వారికే మంచిదని ఇన్ డైరెక్ట్ గా వార్నింగ్ ఇచ్చారు అయ్యన్నపాత్రుడు. 

అయ్యన్న పుట్టినరోజు సందర్భంగా విశాఖ నర్సీపట్నలో హెల్మెట్లు లేకుండా బైక్ ర్యాలీకి సిద్ధమైన టీడీపీ కార్యకర్తలను పోలీసులు అడ్డుకున్నారు. దీంతో అయ్యన్నకి కోపం వచ్చింది. పోలీసుల తీరుపై మండిపడ్డ అయ్యన్న వారికి వార్నింగ్ ఇచ్చినంత పని చేశారు. ”హెల్మెట్లు లేకుంటే ర్యాలీకి అనుమతి లేదంటున్నారు. రాష్ట్రంలో ఎక్కడైనా ఈ పద్దతి ఉందా? మూడేళ్లలో ఎన్నికలు రాబోతున్నాయి. మళ్లీ మా దగ్గరే మీరు పని చేయాలి” అని అయన్నపాత్రుడు హితవు పలికారు.

అధికారంలో ఎవరు ఉన్నా పోలీసులు మాత్రం న్యాయంగా వ్యవహరించాలని సూచించారు. తప్పు పోలీసులది కాదని.. సీఎం జగన్ ఒత్తిడితోనే అలా చేస్తున్నారని ఆరోపించారు. వచ్చే ఎన్నికల్లో టీడీపీ, బీజేపీ, జనసేన కలిసి పోటీ చేస్తాయని తాను అనలేదని అయ్యన్నపాత్రుడు చెప్పారు. మూడు పార్టీలు కలిసి పోటీ చేసే అవకాశం ఉందని చెప్పాను తప్ప.. కచ్చితంగా పోటీ చేస్తాయని నేను అనలేదు అని అయ్యన్న వివరించారు. తన మాటలను మీడియా వక్రీకరించిందని మండిపడ్డారు.