Mudragada Padmanabham: మాజీ మంత్రి ముద్రగడ పద్మనాభంకు తీవ్ర అస్వస్థత..
ముద్రగడ పద్మనాభం కొంతకాలంగా క్యాన్సర్ తో బాధపడుతున్నారు.

Mudragada Padmanabham: మాజీ మంత్రి, కాపు ఉద్యమ నేత ముద్రగడ పద్మనాభం తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. ప్రస్తుతం ఆయన కాకినాడలోని ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. అయితే, మెరుగైన వైద్యం కోసం హైదరాబాద్ తీసుకెళ్లాలని డాక్టర్లు సూచించారు. దీంతో రోడ్డు మార్గంలో అంబులెన్స్ లో ముద్రగడను హైదరాబాద్ తీసుకెళ్లనున్నారు కుటుంబసభ్యులు. ముద్రగడ పద్మనాభం కొంతకాలంగా క్యాన్సర్ తో బాధపడుతున్నారు. గత దాంతో పాట కొంతకాలంగా కూతురు విషయంలో జరుగుతున్న వివాదంతో ముద్రగడ మానసిక ఒత్తిడి గురవుతున్నారు.
ముద్రగడ పద్మనాభం వయసు 72ఏళ్లు. అనారోగ్యంతో శుక్రవారం కాకినాడలోని ప్రైవేట్ ఆసుపత్రిలో చేరారు. అక్కడ డాక్టర్లు ఆయనకు చికిత్స అందిస్తున్నారు. అయితే, ముద్రగడకు మెరుగైన వైద్యం అవసరమని డాక్టర్లు చెప్పారు. ఆయనను హైదరాబాద్ తీసుకెళ్లాలని సూచించారు. డాక్టర్ల
సూచనతో ముద్రగడను హైదరాబాద్ తీసుకెళ్లేందుకు కుటుంబసభ్యులు ఏర్పాట్లు చేస్తున్నారు.
Also Read: ఏపీ లిక్కర్ స్కామ్ కేసులో వైసీపీ ఎంపీ మిథున్ రెడ్డి అరెస్ట్..