అందుకే రాజీనామా చేశా : మాజీ ఎమ్మెల్యే పంచకర్ల

  • Published By: veegamteam ,Published On : March 11, 2020 / 06:38 AM IST
అందుకే రాజీనామా చేశా : మాజీ ఎమ్మెల్యే పంచకర్ల

Updated On : March 11, 2020 / 6:38 AM IST

విశాఖలో టీడీపీకి మరో షాక్ తగిలింది. మాజీ ఎమ్మెల్యే పంచకర్ల రమేష్ బాబు ఆ పార్టీకి రాజీనామా చేశారు. ఈ మేరకు ఆయన బుధవారం (మార్చి 11, 2020) మీడియాతో మాట్లాడుతూ విశాఖ ప్రజలు ఆకాంక్షను అడ్డుకోవడం సరికాదని రమేష్ బాబు అన్నారు. విశాఖ పాలనా రాజధానిగా ఉంటే ఉత్తరాంధ్ర అభివృద్ధి చెందుతుందన్నారు. విశాఖను పాలనా రాజధానిగా చేయడం టీడీపీకి ఇష్టం లేదన్నారు. విశాఖపై టీడీపీ తీరుకు నిరసనగా నేతలు ఆ పార్టీకి రాజీనామా చేస్తున్నారు.(టీడీపీకి వరుస షాక్ లు…వైసీపీలో చేరనున్న మాజీ ఎమ్మెల్యే పంచకర్ల)

రాజధాని వస్తే రౌడీయిజం, ట్రాఫిక్ పెరుగుతుందంటున్నారు. రౌడీయిజం చేయాలంటే రాజధానే ఉండాలా? అన్నారు. విశాఖను ఒకలా అమరావతిని మరోలా చూడటం సరికాదన్నారు. ఒక ప్రాంత మనోభావాలనే గుర్తిస్తారా అని అడిగారు. అన్ని ప్రాంతాల మనోభావాలు టీడీపీకి ముఖ్యం కాదా? అన్నారు.

టీడీపీ అధిష్టానం తీరును రమేష్ బాబు తప్పుబట్టారు. ముడు రాజధానుల నిర్ణయాన్ని వ్యతిరేకించడం తప్పు అన్నారు. గతంలో పార్టీని నష్టపరిచిన వారే ఇప్పుడు బాబుగారి చుట్టూ ఉన్నారని విమర్శించారు.