Facebook Took Life : ఫేస్ బుక్‌తో జాగ్రత్త..! యువకుడి ప్రాణం తీసిన ఫేస్‌బుక్ పరిచయం, ఆ వీడియోలతో బ్లాక్ మెయిల్

ఫేస్ బుక్ పరిచయం చిత్తూరు జిల్లాకు చెందిన ఓ యువకుడి ప్రాణం తీసింది. వి.కోటకు చెందిన మురళి ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు.

Facebook Took Life : ఫేస్ బుక్‌తో జాగ్రత్త..! యువకుడి ప్రాణం తీసిన ఫేస్‌బుక్ పరిచయం, ఆ వీడియోలతో బ్లాక్ మెయిల్

Updated On : December 26, 2022 / 12:11 PM IST

Facebook Took Life : ఫేస్ బుక్ పరిచయం చిత్తూరు జిల్లాకు చెందిన ఓ యువకుడి ప్రాణం తీసింది. వి.కోటకు చెందిన మురళి ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. కూలి పనులు చేసుకునే మురళికి ఇటీవల ఫేస్ బుక్ లో ప్రియా శర్మ పేరుతో ఫ్రెండ్ రిక్వెస్ట్ వచ్చింది. దాన్ని మురళి యాక్సెప్ట్ చేయగానే యువతి అతడితో చాటింగ్ మొదలు పెట్టింది. ఆ పరిచయం అలా అలా పెరిగి ఫోన్ నెంబర్లు ఇచ్చి పుచ్చుకుని వీడియో కాల్స్ చేసుకునే వరకు వెళ్లింది.

10TV LIVE : నాన్ స్టాప్ న్యూస్ అప్‌డేట్స్ కోసం 10TV చూడండి.

ఆ తర్వాత ఆ యువతి తన మోసాన్ని బయట పెట్టింది. మురళి వీడియో కాల్స్ ను మార్ఫింగ్ చేసి అతడికి పంపించింది. తనకు డబ్బులు పంపాలని డిమాండ్ చేసింది. లేదంటే ఆ వీడియోలను సోషల్ మీడియాలో పెడతానని వాట్సాప్ లో బెదిరించింది.

Also Read..Tunisha Sharma Suicide : ప్రముఖ యువ నటి ఆత్మహత్య.. మేకప్ రూమ్‌లోనే ఉరి వేసుకుంది

తాను కూలి పనులు చేసుకునే వాడినని తన దగ్గర డబ్బులు లేవని మురళి ప్రాథేయపడ్డాడు. అయినా, ఆ యువతి కనికరించ లేదు. వీడియో అప్ లోడ్ చేస్తున్నట్లు మేసేజ్ పెట్టడంతో తాను ఆత్మహత్య చేసుకుంటానని మురళి రిప్లయ్ ఇచ్చాడు. రాత్రి ఇంట్లో ఉరేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. సమాచారం అందుకున్న పోలీసులు మురళి ఓపెన్ చేసి చూడగా.. చాటింగ్ లు, ఆడియో మేసేజ్ లు బయటపడ్డాయి.

Also Read..Telangana : లైంగిక దాడి చేసిన స్నేహితుడు-ఆ వీడియోలు వైరల్ చేస్తానని బ్లాక్ మెయిల్