Run Way On Bapatla NH In AP : హైవేపై రన్ వే : వైమానిక విమానాల అత్యవసర ల్యాండింగ్ కోసం రన్‌వేగా మారనున్న బాపట్ల NH..

బాపట్లలోని జాతీయ రహదారిపై వైమానిక విమానాలు ల్యాండ్ కానున్నాయి. వైమానిక విమానాలు జాతీయ రహదారిపైనా? అనే అనుమానం కలగొచ్చు. అత్యవసర సమయంలో ల్యాండ్ చేయటానికి ట్రయల్ రన్ నిర్వహిస్తున్నారు. దీంతో బాపట్ల జిల్లాలోని కొరిశపాడు మండలం పిచ్చికల గుడిపాడు వద్ద జాతీయరహదారిపై వైమానిక విమానాలు సందడి చేస్తున్నాయి.

Run Way On Bapatla NH In AP : హైవేపై రన్ వే : వైమానిక విమానాల అత్యవసర ల్యాండింగ్ కోసం రన్‌వేగా మారనున్న బాపట్ల NH..

Fighter jets, cargo flights landing trial run On Bapatla NH today In andhra-pradesh

Updated On : December 29, 2022 / 11:37 AM IST

Run Way On Bapatla NH In AP : ఆంధ్రప్రదేశ్ లోని ఉమ్మడి ప్రకాశం జిల్లా బాపట్లలోని జాతీయ రహదారిపై వైమానిక విమానాలు ల్యాండ్ కానున్నాయి. వైమానిక విమానాలు జాతీయ రహదారిపైనా? అనే అనుమానం కలగొచ్చు. అత్యవసర సమయంలో ల్యాండ్ చేయటానికి ట్రయల్ రన్ నిర్వహిస్తున్నారు. దీంతో బాపట్ల జిల్లాలోని కొరిశపాడు మండలం పిచ్చికల గుడిపాడు వద్ద జాతీయరహదారిపై వైమానిక విమానాలు సందడి చేస్తున్నాయి.

అత్యవసర సమాయాల్లో విమానాలను సాధారణ బాపట్ల జిల్లాలోని కొరిశపాడు మండలంలోని జాతీయ రహదారిని హైవేగా మారిపోనుంది. దీని కోసం హైవేల్లో కొన్ని కిలోమీటర్ల మేర రోడ్డును ప్రత్యేకంగా తీర్చిదిద్దారు. విదేశాల్లో ఇలాంటి నిర్మాణాలు సాధారణమే అయినా ఇటీవల కాలంలో భారత్ లో కూడా ఇటువంటి ఏర్పాట్లు చేస్తోంది ప్రభుత్వం. దీంట్లో భాగంగానే బాపట్ల జిల్లాలోని కొరిశపాడు జాతీయ రహదారిపై వైమాని విమానాలను ల్యాండ్ చేసేలా హైవేలను మార్చారు. ఈరోజు అంటే డిసెంబర్ 28,2022 కొసరిపాడులో ట్రయల్ రన్ నిర్వహిస్తున్నారు అధికారులు.

ఉత్తరాదిలో, సరిహద్దు ప్రాంతాల్లో ఎక్కువగా ఇలాంటి నిర్మాణాలు చేపట్టగా తాజాగా ఆంధ్రప్రదేశ్ లోనూ వైమానిక విమానాలు ల్యాండ్ అయ్యేలా కొరిశపాడులోని 16వ నంబర్ జాతీయ రహదారిపై విజయవాడ–ఒంగోలు మధ్య ఎయిర్ పాడ్ ను తీర్చిదిద్దారు. ప్రకాశం జిల్లా నుంచి ఏర్పాటైన నూతన జిల్లా అయిన బాపట్ల జిల్లా జె. పంగులూరు మండలం రేణింగవరం, కొరిశపాడు గ్రామాల మధ్య హైవేపై 4 కిలోమీటర్ల మేర విమానాలు దిగేలా సిమెంట్ రోడ్డును హైవేలా తీర్చి దిద్దారు.

గురువారం ఈ హైవేపై వైమానిక విమానాలు ల్యాండ్ అవ్వటానికి ట్రయల్ రన్ నిర్వహిస్తున్నారు. దీని కోసం ట్రాఫిక్ ను మళ్లించారు.దీని కోసం ఒక కార్గో విమానంతో పాటు రెండు ఫైటర్ జెట్ విమానాలు దిగుతాయి. అత్యవసర సమయంలో వినియోగం కోసం అధికారులు అన్ని ఏర్పాట్లు చేశారు. ట్రయల్ రన్ ప్రాంతంలో భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. ఈ ట్రయల్ రన్ తరువాత ఈ హైవే పూర్తి స్థాయిలో రన్ వేగా మారనుంది. ఈ హైవేపై రన్ వేని ప్రధాని మోడీ మరో రెండు మూడు నెలలు ప్రారంభించనున్నారు.