AP Nominated Posts : ఏపీలో నామినేటెడ్ పదవుల కోలాహలం..
ఏపీలో మళ్లీ నామినేటెడ్ పదవుల కోలాహలం ప్రారంభమైంది. సుమారు 80 కార్పొరేషన్లకు ఛైర్మన్లు, 960 మంది డైరెక్టర్ల నియామకానికి రంగం సిద్ధమైంది. ఈ నియామకానికి సంబంధించి రాష్ట్ర సీఎం జగన్ తుది నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది.

Ap Nominated Posts
Filling nominated posts in AP : ఏపీలో మళ్లీ నామినేటెడ్ పదవుల కోలాహలం ప్రారంభమైంది. సుమారు 80 కార్పొరేషన్లకు ఛైర్మన్లు, 960 మంది డైరెక్టర్ల నియామకానికి రంగం సిద్ధమైంది. ఈ నియామకానికి సంబంధించి రాష్ట్ర సీఎం జగన్ సోమవారం (జూన్ 14) తుది నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. వైసీపీ ప్రాంతీయ బాధ్యులు ఐదుగురితో సీఎం జగన్ సమావేశం కానున్నారు. జిల్లాల వారీగా అర్హులతో రూపొందించిన జాబితాలను పరిశీలించనున్న సీఎం పరిశీలించనున్నారు. సీఎం సమ్మతతితో నియామకాల తుది జాబితా ఖరారయ్యే అవకాశం కనిపిస్తోంది.
ఛైర్మన్ల వరకు మాత్రం వారంలోగా ప్రకటించవచ్చని సంబంధిత వర్గాలు పేర్కొన్నాయి. డైరెక్టర్లకు సంబంధించిన జాబితా రెడీగా ఉంది.. అయినప్పటికీ ఏ కార్పొరేషన్‌లో ఎవరిని నియమిస్తారనేది తెలియాలంటే కొంత సమయం పడుతుందని అంటున్నారు. అర్హత ఉన్నా కనీసం నియోజకవర్గ పార్టీ సమన్వయకర్త ఎలాంటి బాధ్యతలు చేపట్టని వారికి మొదటగా ప్రాధాన్యం కల్పించే అవకాశం ఉంది.
2019 ఎన్నికల ముందు నియోజకవర్గ పార్టీ సమన్వయకర్తలుగా పని చేసినప్పటికీ.. చివరి నిమిషంలో ఎమ్మెల్యేగా పోటీ చేసేందుకు టికెట్ రాని వారికి కూడా అవకాశం ఉండనుంది. 2019 ఎన్నికల్లో పోటీ చేసి ఓడిపోయి నియోజకవర్గ పార్టీ సమన్వయకర్తలుగా ఉన్నవారికి కూడా అవకాశం లభించనుంది. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ, మహిళలకు 50శాతం రిజర్వేషన్ ఉంటుందని చెబుతున్నారు. ఒక్కొక్క ఎమ్మెల్యే నలుగురికి చొప్పున అభ్యర్థులను డైరెక్టర్ల పదవులకు సిఫార్సు చేసే ఛాన్స్ ఉంది. 150 మంది
ఎమ్మెల్యేల నుంచి వచ్చిన 600 మంది అభ్యర్థుల పేర్లతో జాబితా రెడీ అవుతుంది. డైరెక్టరు పదవిని ఆశించే వారు కనీసం 2017 నుంచి పార్టీలో పనిచేసి ఉండాలని నిర్ణయించినట్లు సమాచారం. ఛైర్మన్ పదవుల్లాగే డైరెక్టర్ల ఎంపిక విషయంలోనూ 50శాతం రిజర్వేషన్ అమలు చేసే అవకాశం ఉంది.