Badvel By Poll: పోస్టల్ బ్యాలెట్ లెక్కింపు..వైసీపీ అభ్యర్థి లీడ్

బద్వేల్ నియోజకవర్గానికి సంబంధించి ఉప ఎన్నిక కౌంటింగ్ అధికారులు ప్రారంభించారు. 2021, నవంబర్ 02వ తేదీ మంగళవారం ఉదయం 8 గంటల నుంచి ఈవీఎంలలో నిక్షిప్తమైన ఓట్లను లెక్కిస్తున్నారు.

Badvel By Poll: పోస్టల్ బ్యాలెట్ లెక్కింపు..వైసీపీ అభ్యర్థి లీడ్

Badvel Bypoll

Updated On : November 2, 2021 / 9:13 AM IST

YCP Candidate Lead : బద్వేల్ నియోజకవర్గానికి సంబంధించి ఉప ఎన్నిక కౌంటింగ్ అధికారులు ప్రారంభించారు. 2021, నవంబర్ 02వ తేదీ మంగళవారం ఉదయం 8 గంటల నుంచి ఈవీఎంలలో నిక్షిప్తమైన ఓట్లను లెక్కిస్తున్నారు. బాలయోగి గురుకుల పాఠశాలలో ఓట్లను లెక్కిస్తున్నారు. అంతకంటే ముందు..పోస్టల బ్యాలెట్ లను లెక్కించారు. ఈ ఓట్లలో వైసీపీ అభ్యర్థి సుధ ముందంజలో ఉన్నారు. మొత్తం బ్యాలెట్ ఓట్లు 259 వరకు ఉన్నాయి. అనంతరం ఈవీఎంలను తెరిచారు. కలసపాడు మండలానికి సంబంధించిన ఓట్లను లెక్కిస్తున్నారు అధికారులు.

Read More : Huzurabad By Poll : పోస్టల్ బ్యాలెట్ ఓట్లు, లీడ్‌‌లో టీఆర్ఎస్

బద్వేల్ లో 2021, అక్టోబర్ 30వ తేదీ శనివారం పోలింగ్ జరిగిన సంగతి తెలిసిందే. 2019 ఎన్నికల్లో బద్వేల్ నుంచి వైసీపీ నుంచి పోటీ చేసి గెలిచిన ఎమ్మెల్యే డాక్టర్ వెంకట సుబ్బయ్య అకాల మరణంతో నియోజకవర్గంలో ఉప ఎన్నిక అనివార్యమైంది. చనిపోయిన ఫ్యామిలీకి ఈ ఉప ఎన్నికల్లో టికెట్ ఇవ్వడంతో చనిపోయిన వారి జ్ఞాపకార్థం టీడీపీ, జనసేనలు బద్వేల్ లో పోటీ చెయ్యట్లేదు. బీజేపీ, కాంగ్రెస్ పార్టీల అభ్యర్థులు పోటీలో నిల్చున్నారు. బద్వేల్ లో అధికారపక్ష పార్టీ వైసీపీ అభ్యర్థిగా మరణించిన వెంకటసుబ్బయ్య భార్య సుధను బరిలో దింపింది.