Train Fire Broke Out : ఏలూరు రైల్వే స్టేషన్ లో రైలులో అగ్నిప్రమాదం

సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది వెంటనే ఘటనాస్థలికి చేరుకుని మంటలను అదుపులోకి తెచ్చారు. అగ్నిప్రమాదానికి షార్ట్ సర్క్యూట్ కారణంగా తెలుస్తోంది.

Train Fire Broke Out : ఏలూరు రైల్వే స్టేషన్ లో రైలులో అగ్నిప్రమాదం

train fire

Updated On : June 10, 2023 / 11:54 PM IST

Eluru railway station : ఏపీలోని ఏలూరు రైల్వే స్టేషన్ లో రైలులో అగ్నిప్రమాదం జరిగింది. రైల్వే టెక్నికల్ వ్యాగన్ లో మంటలు చెలరేగాయి. వ్యాగన్ లో ఆయిల్ టి్న్నులు ఉండటంతో మంటలు అంటుకోవడంతో బోగీ మొత్తం దగ్ధమైంది. మంటలను గమనించిన రైల్వే సిబ్బంది అగ్నిమాపక సిబ్బందికి సమాచారం ఇచ్చారు.

సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది వెంటనే ఘటనాస్థలికి చేరుకుని మంటలను అదుపులోకి తెచ్చారు. అగ్నిప్రమాదానికి షార్ట్ సర్క్యూట్ కారణంగా తెలుస్తోంది. అయితే, సకాలంలో మంటలను అదుపులోకి తీసుకురావడంతో పెను ప్రమాదం తప్పింది. ప్రమాదం జరిగిన సమయంలో 9 మంది సిబ్బంది బోగీలో ఉన్నట్లు తెలుస్తోంది.

Odisha : ఒడిశా బాలాసోర్ లో మరో ఘటన.. రైలులో చెలరేగిన మంటలు

కాగా, ఇటీవల వరుస రైలు ప్రమాదాలు ప్రయాణికులను ఆందోళనకు గురి చేస్తున్నాయి. ఒడిశా బాలాసోర్ లో జరిగిన రైలు ప్రమాదంలో 280 మందికి పైగా ప్రయాణికులు చనిపోయారు. 1,000 మందికిపైగా గాయపడ్డారు. ఈ ఘటనను మరిచిపోకముందే పలు రైళ్లల్లో అగ్నిప్రమాదాలు చోటు చేసుకోవడం ఆందోళన కలిగిస్తోంది.