Floods In Kadapa : కడప జిల్లాలో వరదలు..పూజలకు వెళ్లి 16 మంది గల్లంతు, ప్రాణాలు కోల్పోయిన వేలాది మూగజీవాలు

కడప జిల్లాలో మందపల్లి శివాలయం వద్ద పూజలకు వెళ్లిన 16 మంది గల్లంతు అయ్యారు. వీరిలో ఒకర మాత్రమే ప్రాణాలతో క్షేమంగా బయటపడ్డారు. మిగిలిన వారి కోసం గాలింపు కొనసాగుతోంది.

Floods In Kadapa : కడప జిల్లాలో వరదలు..పూజలకు వెళ్లి 16 మంది గల్లంతు, ప్రాణాలు కోల్పోయిన వేలాది మూగజీవాలు

Floods (1)

Updated On : November 20, 2021 / 10:22 PM IST

16 people missing in Floods : కడప జిల్లాలో మందపల్లి శివాలయం వద్ద పూజలకు వెళ్లిన 16 మంది గల్లంతు అయ్యారు. వీరిలో ఒకర మాత్రమే ప్రాణాలతో క్షేమంగా బయటపడ్డారు. మిగిలిన వారి కోసం గాలింపు కొనసాగుతోంది. వరదలో ఇళ్లు పూర్తిగా నేల మట్టమట్టాయి. వరద నీటిలో మునిగి వేలాది మూగజీవాలు ప్రాణాలు కోల్పోయాయి.

పంటపొలాల్లోకి ఐదు అడుగుల మేర ఇసుకు చేరింది. ఈదురు గాలుల, భారీ వర్షాలకు కరెంట్ స్తంభాలు విరిగిపోయాయి. దీంతో గ్రామాలు అంధకారంలో ఉన్నాయి. కార్లు, ఆటోలు, బైకులు వరదలో కొట్టుకుపోయాయి.

Corona : ఏపీలో కొత్తగా 164 కరోనా కేసులు, ఒకరి మృతి

మందపల్లి, పులపత్తూరులో హృదయవిదారక దృశ్యాలు కనిపిస్తున్నాయి. నిత్యవసరాలు కొట్టుకుపోయి ప్రజలు ఆకలితో అలమటిస్తున్నారు. వరదలు తగ్గుముఖం పట్టడంతో సహాయక చర్యలు కొనసాగుతున్నాయి.కడప జిల్లాలో వరదలు..పూజలకు వెళ్లి 16 మంది గల్లంతు, ప్రాణాలు కోల్పోయిన వేలాది మూగజీవాలు