బాబోయ్.. కాకినాడ సుబ్బయ్య హోటల్ భోజనంలో జెర్రి..!

కిచెన్ లో పరిశుభ్రతపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. వంట చేసే విధానంపైనా సందేహాలు వస్తున్నాయి.

బాబోయ్.. కాకినాడ సుబ్బయ్య హోటల్ భోజనంలో జెర్రి..!

Updated On : November 14, 2024 / 9:20 PM IST

Kakinada Subbayya Gari Hotel : విజయవాడలోని కాకినాడ సుబ్బయ్య హోటల్ లో దారుణం వెలుగుచూసింది. భోజనం చేసేందుకు వెళ్లిన ఓ కస్టమర్ కు చేదు అనుభవం ఎదురైంది. తాను తింటున్న అన్నంలో జెర్రి రావడంతో కస్టమర్ అవాక్కయ్యాడు. అదే సమయంలో హోటల్ లో భోజనం చేస్తున్నారు కేంద్ర హెచ్ఆర్ సీ ఇంఛార్జ్ ఛైర్మన్ విజయ భారతి. హోటల్ సిబ్బంది తీరుపై ఆమె సీరియస్ అయ్యారు. వెంటనే ఫుడ్ సేఫ్టీ అధికారులకు ఫిర్యాదు చేశారు. రంగంలోకి దిగిన అధికారులు హోటల్ ను సీజ్ చేశారు. ఫుడ్ శాంపిల్స్ ను ల్యాబ్ కు పంపించారు.

బెజవాడల కాకినాడ సుబ్బయ్య హోటల్ అంటే చాలా ఫేమస్. అలాంటి హోటల్ లో ఇవాళ దారుణం జరిగింది. భోజనంలో జెర్రి కనిపించడం తీవ్ర కలకలం రేపింది. అదే సమయంలో హోటల్ లో భోజనం చేసేందుకు కేంద్ర మానవ హక్కుల కమిషన్ ఛైర్మన్ విజయ భారతి సయాని కూడా రావడం జరిగింది. భోజనం చేసే సమయంలో ఓ కస్టమర్ కు తాను తినే అన్నంలో జెర్రి వచ్చిందనడంతో హోటల్ లో భోజనం చేస్తున్న మిగతా కస్టమర్లు అంతా ఉలిక్కిపడ్డారు.

భోజనంలో జెర్రి వచ్చిందని తెలిసి విజయ భారతి కూడా కంగుతిన్నారు. చాలా నిర్లక్ష్యంగా వ్యవహరించారంటూ హోటల్ నిర్వాహకులపై ఆమె సీరియస్ అయ్యారు. వెంటనే గుంటూరు, కృష్ణా జిల్లాలకు చెందిన ఫుడ్ సేఫ్టీ అధికారులకు ఫోన్ చేసి ఫిర్యాదు చేశారు. అటు స్థానికులు సైతం పోలీసులకు ఫోన్ చేశారు. భోజన శాంపుల్స్ ను అధికారులు సేకరించి ల్యాబ్ కు తరలించారు. సుబ్బయ్య హోటల్ లో వెలుగుచూసిన ఘటన స్థానికంగా సంచలనంగా మారింది. ఈ విషయం తెలిసి అంతా షాక్ కి గురవుతున్నారు.

కాకినాడ సుబ్బయ్య హోటల్ చాలా ఫేమస్. ఏపీలోనే కాదు తెలంగాణలోనూ పలు చోట్ల ఈ హోటల్ బ్రాంచులు ఉన్నాయి. ఎక్కడెక్కడి నుంచో వచ్చి మరీ ఇక్కడ భోజనం చేసేందుకు ఇంట్రస్ట్ చూపిస్తారు. ఇక్కడ భోజనం చాలా రుచికరంగా ఉంటుందని తిన్న కస్టమర్లు చెబుతారు. అందుకే, ఈ హోటల్ లో భోజనం చేసేందుకు ఆసక్తి చూపిస్తారు. అలాంటి హోటల్ భోజనంలో జెర్రి కనిపించిందనే వార్త తీవ్ర కలకలం రేపుతోంది. కిచెన్ పరిశుభ్రతపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. వంట చేసే విధానంపైనా సందేహాలు వస్తున్నాయి.

తెలుగు రాష్ట్రాల్లోని హోటళ్లు, రెస్టారెంట్లలో ఇలాంటి ఘటనలు తరుచుగా వెలుగులోకి వస్తున్నాయి. నిత్యం ఏదో ఒక హోటల్ లేదా రెస్టారెంట్స్ లో ఆహారంలో పురుగులు, బొద్దింకలు, జెర్రిలు దర్శనమిస్తూ కస్టమర్లను తీవ్ర భయాందోళనకు గురి చేస్తున్నాయి. అసలు, హోటల్స్ లేదా రెస్టారెంట్లకు వెళ్లి తినాలంటేనే వణికిపోయే పరిస్థితి ఏర్పడింది. కిచెన్ లో పరిశుభ్రతను హోటళ్ల నిర్వాహకులు గాలికి వదిలేశారు. కిచెన్ లోని పరిసరాలు చాలా దారుణంగా ఉంటున్నాయి. పురుగులు, ఎలుకలు, బొద్దింకలు స్వైర విహారం చేస్తున్నా పట్టించుకోవడం లేదు. అవి ఆహార పదార్దాల్లో పడటం, వాటినే కస్టమర్లకు వడ్డించటం జరుగుతోంది.

ఫుడ్ సేఫ్టీ అధికారలు తనిఖీలు చేస్తున్నా, కేసులు పెడుతున్నా.. ఇంకా కొందరు హోటళ్ల యజమానుల్లో మార్పు రావడం లేదు. అందుకే ఇలాంటి దారుణాలు వెలుగు చూస్తూనే ఉన్నాయని కస్టమర్లు వాపోతున్నారు. ప్రజల ఆరోగ్యంతో చెలగాటం ఆడే హోటల్స్ నిర్వాహకులను కఠినంగా శిక్షించాలనే డిమాండ్లు వినిపిస్తున్నాయి.