adulterated ghee : కాసుల కక్కుర్తితో ప్రజల ప్రాణాలతో చెలగాటం

విజయవాడలో కల్తీ నెయ్యి తయారీ కేంద్రాలపై ఫుడ్ సేఫ్టీ అధికారులు దాడులు నిర్వహించారు. కల్తీ నెయ్యి కారణంగా అనేక మంది ప్రజలు అనారోగ్యాలకు గురవుతున్నారని తెలిపారు.

adulterated ghee : కాసుల కక్కుర్తితో ప్రజల ప్రాణాలతో చెలగాటం

Food Safety Officials Raid On Adulterated Ghee Manufacturing Plants

Updated On : April 6, 2021 / 8:20 PM IST

adulterated ghee in Vijayawada : విజయవాడలో కల్తీ నెయ్యి తయారీ కేంద్రాలపై ఫుడ్ సేఫ్టీ అధికారులు దాడులు నిర్వహించారు. కల్తీ నెయ్యి కారణంగా అనేక మంది ప్రజలు అనారోగ్యాలకు గురవుతున్నారని తెలిపారు. గతంలో అనేక సార్లు దాడులు నిర్వహించినా.. కాసుల కక్కుర్తితో కొందరు వ్యక్తులు తమ తీరు మార్చుకోవడంలేదన్నారు.

అధికారుల దాడులతో కంపెనీల నిర్వాహకులు పరారయ్యారు. ఇప్పటికే మూడు కంపెనీలపై దాడులు నిర్వహించినట్లు అధికారులు తెలిపారు. కల్తీ నెయ్యి తినడంద్వారా ఊపిరితిత్తులు, జీర్ణకోశ సమస్యలతో పాటు క్యాన్సర్‌ వచ్చే ప్రమాదం ఉందని అధికారులు అంటున్నారు.

ఇక్కడ తయారు చేసిన నెయ్యిని వివిధ ప్రాంతాలకు సైతం సరఫరా చేస్తున్నారని అనుమానం వ్యక్తం చేశారు. నెయ్యి శాంపిల్స్‌ను ల్యాబ్‌కు పంపించామని.. రిపోర్ట్స్‌ ఆధారంగా నింధితులపై కఠిన చర్యలు తీసుకుంటామంటున్నారు.