మూడో రోజు.. పోలవరంలో విదేశీ నిపుణుల పర్యటన..
కేంద్ర ప్రభుత్వం రూ.960 కోట్లు కేటాయించిన నేపథ్యంలో.. కొత్త డయాఫ్రం వాల్ నిర్మాణానికి ఏపీ సర్కార్ కూడా సన్నద్ధమవుతోంది.

Polavaram Project (Photo Credit : Google)
Polavaram Project : పోలవరం ప్రాజెక్ట్ ను విదేశీ నిపుణుల బృందం మరోసారి సందర్శించింది. ప్రధాన డ్యామ్ నిర్మాణం, డిజైన్లు, నిర్మాణ షెడ్యూల్ పై చర్చించింది. డయాఫ్రం వాల్ నిర్మాణం తర్వాతే ప్రధాన డ్యామ్ నిర్మించాలా లేక సమాంతరంగా నిర్మించుకోవచ్చా అనే అంశాలపై డిస్కస్ చేసింది. జలవనరుల శాఖ అధికారులు, కంపెనీ ప్రతినిధులతో విదేశీ నిపుణుల బృందం చర్చలు జరిపింది. అనంతరం కేంద్ర జల సంఘం ఛైర్మన్ తో వర్చువల్ విధానంలో నిపుణుల బృందం సమావేశం కానుంది. మూడు రోజుల పాటు పోలవరం ప్రాజెక్ట్ పై అధ్యయనం చేసిన అంశాలను కేంద్ర జల సంఘం ఛైర్మన్ కు విదేశీ నిపుణుల బృందం వివరించనుంది.
పోలవరం ప్రాజెక్ట్ లో విదేశీ నిపుణుల బృందం పర్యటన కొనసాగుతోంది. గత మూడు రోజుల నుంచి కూడా నిపుణుల బృందం పర్యటనతో పోలవరం ప్రాజెక్ట్ లో కొంత ఉత్తేజం కూడా నెలకొంది. మొదటి రోజున 6వ తేదీన నిపుణులు కొత్త డయాఫ్రం వాల్ నిర్మాణానికి సంబంధించి.. అప్పర్ లోయర్ కాపర్ డ్యామ్ ల పటిష్టత, సీపేజ్ వాటర్ లీకేజీని అరికట్టేందుకు తీసుకోవాల్సిన చర్యలు, రేపు వరదలు వస్తే ఏ విధంగా అరికట్టవచ్చు అనే అంశాలపై క్షుణ్ణంగా పరిశీలన చేశారు.
రెండో రోజున ప్రధానంగా డయాఫ్రం వాల్ నూతన డిజైన్లు, ఏ విధంగా నిర్మాణం చేపట్టాలి అనేదానిపై అధికార యంత్రాంగం నిపుణుల బృందంతో చర్చించింది. ఇక మూడో రోజున.. ప్రధానంగా పెండింగ్ లో ఉన్న ప్రధాన డ్యామ్, స్పిల్ వే, అప్రోచ్ చానల్ నిర్మాణ పనులను ఏ విధంగా పూర్తి చేయాలి? సమస్యలను ఏ విధంగా అధిగమించవచ్చు? అనే అంశాలపై ముఖ్యంగా డిస్కస్ చేశారు. మూడు రోజుల పాటు విదేశీ నిపుణుల బృందంతో చర్చించిన అంశాలపై పూర్తి స్థాయిలో ఒక నివేదిక రూపంలో ప్రభుత్వానికి అందజేయనున్నారు.
ఈ నెల 15వ తేదీ తర్వాత నూతన డిజైన్లు, కొత్త డయాఫ్రం వాల్ నిర్మాణ పనులు ప్రారంభించేందుకు ఏపీ ప్రభుత్వం సన్నద్ధంగా ఉన్న నేపథ్యంలో.. ప్రభుత్వానికి కొత్త డిజైన్ ను విదేశీ నిపుణుల బృందం ఇవ్వనుంది. దీనిపై అధికార యంత్రాంగం కూడా పూర్తి స్థాయిలో సన్నద్ధమైంది. కొత్త డిజైన్లు ఖరారు చేయగానే పూర్తి స్థాయిలో నిర్మాణ పనులు చేపట్టేందుకు ప్రభుత్వం రెడీ అయ్యింది.
కేంద్ర ప్రభుత్వం ఈ మేరకు రూ.960 కోట్లు కేటాయించిన నేపథ్యంలో.. కొత్త డయాఫ్రం వాల్ నిర్మాణానికి ఏపీ సర్కార్ కూడా సన్నద్ధమవుతోంది. మూడో రోజు పోలవరం ప్రాజెక్ట్ ప్రధాన డ్యామ్ కు సంబంధించిన అంశాలపై నిపుణుల బృందం డిస్కస్ చేసింది. డేవిడ్ బి పాల్, గియాస్ ఫ్రాన్ కో డీ సిస్ కో(అమెరికా), రిచర్చ్ డోనెల్లీ, సీయాస్ హిన్స్ బెర్గర్(కెనడా), సీడబ్ల్యూసీ డైరెక్టర్ రాకేశ్ తొటేజా, డిప్యూటీ డైరెక్టర్ అశ్వని కుమార్ వర్మ.. నిపుణుల బృందంలో సభ్యులుగా ఉన్నారు.
* పోలవరం ప్రాజెక్ట్ ను సందర్శించిన విదేశీ నిపుణుల బృందం
* ప్రధాన డ్యామ్ నిర్మాణం, డిజైన్లు, నిర్మాణ షెడ్యూలపై చర్చ
* డయాఫ్రం వాల్ నిర్మాణం తర్వాత ప్రధాన డ్యామ్ నిర్మించే అంశంపై చర్చ
* జలవనరుల శాఖ అధికారులు, కంపెనీ ప్రతినిధులతో నిపుణుల చర్చలు
* పోలవరం ప్రాజెక్ట్ ప్రాంతంలో మూడు రోజులుగా విదేశీ నిపుణుల పరిశీలన
* నిన్న కొత్త డయాఫ్రమ్ వాల్ నిర్మాణంపై సుదీర్ఘ చర్చలు
* పాత డయాఫ్రమ్ వాల్ కు ఎగువున 6 మీటర్ల దూరంలో కొత్త డయాఫ్రం వాల్ నిర్మాణం
* కొత్త డయాఫ్రమ్ వాల్ మరింత ప్లాస్టిసిటి ఉండేలా నిర్మించాలని సూచన
* ఆఫ్రి సంస్థ రూపొందించిన డిజైన్లపై సుదీర్ఘంగా సాగిన చర్చ
Also Read : కుప్పం, హిందూపురం మున్సిపాలిటీలపై టీడీపీ గురి.. చంద్రబాబు, బాలకృష్ణ మాస్టర్ ప్లాన్