మాజీ మంత్రి అచ్చెన్నాయుడు జీజీహెచ్ నుంచి డిశ్చార్జ్..విజయవాడ సబ్ జైలుకు తరలింపు

  • Published By: bheemraj ,Published On : July 1, 2020 / 07:09 PM IST
మాజీ మంత్రి అచ్చెన్నాయుడు జీజీహెచ్ నుంచి డిశ్చార్జ్..విజయవాడ సబ్ జైలుకు తరలింపు

Updated On : July 1, 2020 / 7:22 PM IST

మాజీ మంత్రి, టీడీపీ నేత అచ్చెన్నాయుడును గుంటూరు జీజీహెచ్ నుంచి డిశ్చార్జ్ చేశారు. ఆరోగ్యం నిలకడగా ఉండటంతో వైద్యులు అతన్ని డిశ్చార్జ్ చేశారు. అచ్చెన్నాయుడికి కరోనా టెస్టులు చేయనున్నట్లు వైద్యులు చెబుతున్నారు. అచ్చెన్నాయుడును విజయవాడ సబ్ జైలుకు పోలీసులు తరలించనున్నారు. టీడీపీ నేతలు దేవినేని ఉమా, అలపాటి రాజా, నక్కా ఆనంద్ బాబు, జీవీ ఆంజనేయులు జీజీహెచ్ కు చేరుకున్నారు. ఆ పార్టీ నేతలు, కార్యకర్తలు భారీగా చేరుకున్నారు.

గత నెల 12 వ తేదీన అచ్చెన్నాయుడు జీజీహెచ్ లో చేరారు. అప్పటి నుంచి అక్కడే చికిత్స పొందుతున్నారు. ఈ రోజు కూడా ఆరోగ్యం బాగా లేకపోవడంతో అచ్చెన్నాయుడు సూపరింటెండెంట్ కు లేఖ రాశారు. అతనికి కరోనా టెస్టు చేయాల్సిన అవసరం ఉందని వైద్యులు సూచించారు. కానీ ఇవాళ సాయంత్రం అత్యవసరంగా డిశ్చార్జ్ చేశారు. ఏసీబీ కోర్టులో కూడా దీనిపై బెయిల్ పిటిషన్ దాఖలు చేశారు.

దీన్ని కోర్టు రిజర్వులో ఉంచింది. రేపు దీనిపై కోర్టులో తీర్పు వెలువడే అవకాశం ఉంది. టీటీడీ నేతలు భారీగా చేరుకున్నారు. అతనికి ఆరోగ్యం బాగాలేకపోయినా ఆస్పత్రి నుంచి తరలించడంపై ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. అచ్చెన్నాయుడి ఆరోగ్య పరిస్థితి మెరుగుపడే వరకు ఆస్పిటల్ లోనే ఉంచాలని డిమాండ్ చేస్తున్నారు. జై అచ్చెన్నాయుడు…అచ్చెన్నాయుడు నాయకత్వం వర్ధిల్లాలి అంటూ నినాదాలు చేశారు.

తనకు కరోనా పరీక్షలు చేయలేదని అచ్చెన్నాయుడు ఆరోపించారు. ఇప్పటికే ఆయన సూపరింటెండెంట్ కు లేఖ రాశారు. తనకు ఆరోగ్యం కూడా బాగా లేదు కాబట్టి మరికొన్ని పరీక్షలు చేయించాలని చెప్పారు. ఇవాళ కానీ రేపు గానీ రెండు టెస్టులు చేయాలని చెప్పారు. అయితే అచ్చెన్నాయుడు ఆరోగ్యం బాగానే ఉందని గుంటూరు వైద్యులు చెప్పారు. ఉదయం నుంచి గుండె, బీపీకి సంబంధించిన టెస్టులు చేశారు. దీంతో ఆయన్ను ఈరోజు సాయంత్రం డిశ్చార్జ్ చేశారు.

ఈఎస్‌ఐ ఆసుపత్రులకు సంబంధించి మందులు, వైద్య పరికరాల కొనుగోళ్లలో అక్రమాలు చోటు చేసుకున్నాయని వైసీపీ ప్రభుత్వం విజిలెన్స్‌ అండ్ ఎన్‌ఫోర్స్‌ మెంట్ దర్యాప్తునకు ఆదేశించింది. ఈఎస్‌ఐలో అవినీతి జరిగినట్లు విజిలెన్స్‌ దర్యాప్తులో తేలింది. నకిలీ కొటేషన్లతో ఆర్డర్లు ఇచ్చినట్టు విజిలెన్స్‌ అధికారులు గుర్తించారు. దీంతో అచ్చెన్నాయుడుని కొన్ని రోజుల క్రితం అరెస్టు చేశారు.