జోగి రమేశ్ చుట్టూ బిగుస్తున్న ఉచ్చు.. విచారణకు రావాలని ఆదేశం
అగ్రిగోల్డ్ భూముల వ్యవహరం కేసులో ఇప్పటికే జోగి రమేశ్ తనయుడు రాజీవ్ ను ఏసిబి అధికారులు అరెస్టు చేసిన విషయం తెలిసిందే.

Former minister Jogi Ramesh
Jogi Ramesh : చంద్రబాబు నాయుడు ఇంటిపై దాడి కేసులో మంగళగిరి డిఎస్పి కార్యాలయం ఎదుట హాజరుకావాలని మంగళగిరి డిఎస్పి మాజీమంత్రి జోగ రమేశ్ కి నోటీసులు ఇచ్చిన విషయం తెలిసిందే. ఇవాళ మంగళగిరి డీఎస్పీ కార్యాలయం ఎదుట జోగి రమేశ్ హాజరు కానున్నారు. చంద్రబాబు నాయుడు ఇంటిపై దాడి చేసేందుకు ఎందుకు వెళ్లారు..? దాడి చేయడానికి గల కారణాలు ఏమిటి అని రమేశ్ ను పోలీసులు ప్రశ్నించనున్నారు. మీతో పాటు ఎవరెవరు వచ్చారు.. మిమ్మల్ని ఎవరు ప్రేరేపించారు అనే విషయాలపై రమేశ్ ను విచారించే అవకాశం ఉంది.
Also Read : Bunny Vasu – Pawan Kalyan : పవన్ కళ్యాణ్ ఫ్యాన్ గా వచ్చి.. ఇప్పుడు ఆయనతో పొలిటికల్ గా నడుస్తున్నాను..
మరోవైపు అగ్రిగోల్డ్ భూముల వ్యవహరం కేసులో ఇప్పటికే జోగి రమేశ్ తనయుడు రాజీవ్ ను ఏసిబి అధికారులు అరెస్టు చేసిన విషయం తెలిసిందే. ఈ వ్యవహరంలో జోగి రమేశ్ తనయుడుతోపాటు భూముల కొనుగోలు చేసిన వారిని, భూములు అమ్ముటకు సహకరించిన ప్రభుత్వ అధికారులపై చర్యలు తీసుకునేందుకు ఏసీబీ రంగం సిద్ధం చేస్తోంది. ఇదిలాఉంటే టీడీపీ కేంద్ర కార్యాలయంపై దాడి కేసులో వైసీపీ నేతల ముందస్తు బెయిల్ పిటిషన్ పై ఇవాళ హైకోర్టు లో విచారణ. జరగనుంది. వైసీపీ ఎమ్మెల్సీ అప్పిరెడ్డి, తులశిలతో పాటు దేవినేని అవినాశ్, నందిగామ సురేశ్ లు ముందస్తు బెయిల్ పిటిషన్లు దాఖలు చేశారు.