Velampalli Comments Chandrababu : చంద్రబాబుపై మాజీ మంత్రి వెలంపల్లి శ్రీనివాసరావు సంచలన వ్యాఖ్యలు

టీడీపీ అధినేత చంద్రబాబుపై మాజీ మంత్రి వెలంపల్లి శ్రీనివాసరావు సంచలన వ్యాఖ్యలు చేశారు. రాష్ట్రంలో అశాంతి సృష్టించడానికి చంద్రబాబు ఒక ఉగ్రవాదిలా, ఉన్మాదిలా ప్రవర్తిస్తున్నారని తీవ్ర వ్యాఖ్యలు చేశారు.

Velampalli Comments Chandrababu : చంద్రబాబుపై మాజీ మంత్రి వెలంపల్లి శ్రీనివాసరావు సంచలన వ్యాఖ్యలు

Velampalli Srinivasarao

Updated On : February 18, 2023 / 11:44 AM IST

Velampalli Comments Chandrababu : టీడీపీ అధినేత చంద్రబాబుపై మాజీ మంత్రి వెలంపల్లి శ్రీనివాసరావు సంచలన వ్యాఖ్యలు చేశారు. రాష్ట్రంలో అశాంతి సృష్టించడానికి చంద్రబాబు ఒక ఉగ్రవాదిలా, ఉన్మాదిలా ప్రవర్తిస్తున్నారని తీవ్ర వ్యాఖ్యలు చేశారు. చంద్రబాబుకు ఎన్నికల కోడ్ నిబంధనలు తెలియవా అని మండిపడ్డారు. ఎన్నికల కోడ్ ఉంటే రాష్ట్ర ప్రభుత్వానికి ఆపాదిస్తే ఎలా అని ప్రశ్నించారు. 40 ఏళ్ళ ఇండస్ట్రీ అని చెప్పుకునే చంద్రబాబుకు ఎన్నికల కోడ్ రూల్స్ తెలియవా అని ఎద్దేవా చేశారు.

ప్రజలను రెచ్చగొట్టేందుకు, రాష్ట్ర విధ్వంసానికే చంద్రబాబు యాత్రలు చేస్తున్నారంటూ మండిపడ్డారు. చంద్రబాబు లాంటి దుర్మార్గులు రాష్ట్రానికి పనికిమాలిన వాళ్ళని తీవ్రంగా విమర్శించారు. తెలంగాణాలో ఉంటూ రాష్ట్రం గురించి మాట్లాడడం సిగ్గుచేటన్నారు. టీడీపీ నేతలే ఏపీలో ఇళ్ళు కొనుక్కుని రమ్మంటే నోరు మెదపని వ్యక్తి చంద్రబాబు అని విమర్శించారు. చంద్రబాబు, లోకేష్ సైకోళ్లా ప్రవర్తిస్తూ రాష్ట్రాన్ని నాశం చేయడానికి కంకణం కట్టుకున్నారని పేర్కొన్నారు.

Vijayawada Girl Suicide : సస్పెండ్ చేస్తే సరిపోదు.. చంద్రబాబు, లోకేష్ సమాధానం చెప్పాలి-మంత్రి వెల్లంపల్లి

చంద్రబాబు మారకపోతే పద్ధతి కాదని.. ప్రభుత్వం అడ్డుకోవాలంటే చంద్రబాబు అడుగు బయటకు వేయగలడా అని అన్నారు. రాబోయే ఎన్నికల్లో కుప్పంలో చంద్రబాబు ఓడిపోతున్నారని జోస్యం చెప్పారు. పోలీస్ రక్షణ లేకుండా చంద్రబాబు బయటకు వచ్చే దమ్మూ, ధైర్యం ఉందా అని ప్రశ్నించారు. పోలీసులు, వ్యవస్ధలపైన, ముఖ్యమంత్రిపైన చంద్రబాబు పిచ్చోడిలా మాట్లాడుతున్నారని మండిపడ్డారు. చంద్రబాబు లాంటి వ్యక్తులు సంఘానికి పనికిరారని పేర్కొన్నారు.

చంద్రబాబుకు పిచ్చి ముదిరి సైకో మాదిరి ఉన్మాది, ఉగ్రవాదిలా మాట్లాడుతున్నారని మండిపడ్డారు. చంద్రబాబును రాష్ట్రంలోకి అనుమతించకూడదన్నారు. పోలీసులపైన చంద్రబాబు మాట్లాడిన మాటలను వెనక్కి తీసుకోవాలని చెప్పారు. పోలీసుల రక్షణలో బతుకున్న చంద్రబాబు.. పోలీసులపైన మాట్లాడడమా అని నిలదీశారు. పోలీసుల వలయం లేకుండా ఒక్కరోజైనా బయట తిరుగలేని సిగ్గూ, సెరం లేని వ్యక్తి చంద్రబాబు అంటూ ఘాటు వ్యాఖ్యలు చేశారు.