Medical Colleges : నేడు ఏపీలో 14 మెడికల్ కాలేజీలకు శంకుస్థాపన

ఏపీలో నేడు రాష్ట్రవ్యాప్తంగా 14 మెడికల్ కాలేజీల నిర్మాణాలకు ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి శంకుస్థాపన చేయనున్నారు. వర్చువల్ విధానం ద్వారా ఈ

Medical Colleges : నేడు ఏపీలో 14 మెడికల్ కాలేజీలకు శంకుస్థాపన

Medical Colleges

Updated On : May 31, 2021 / 7:55 AM IST

Medical Colleges : ఏపీలో నేడు 14 మెడికల్ కాలేజీల నిర్మాణాలకు ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి శంకుస్థాపన చేయనున్నారు. వర్చువల్ విధానం ద్వారా ఈ కార్యక్రమం చేపట్టనున్నారు. ఈ వైద్య కళాశాలల నిర్మాణం 2023 నాటికి పూర్తి చేయాలనీ సర్కారు లక్ష్యంగా పెట్టుకుంది. ఏపీ వ్యాప్తంగా మొత్తం 16 మెడికల్ కాలేజీలు నిర్మించాలని ప్రభుత్వం నిర్ణయించింది.

అయితే ఇప్పటికే పులివెందుల, పాడేరు కాలేజీల నిర్మాణానికి శంకుస్థాపన చేసి పనులు మొదలుపెట్టింది.. ఈ క్రమంలో మిగిలిన 14 కాలేజీల నిర్మాణానికి నేడు అంకురార్పణ చేయనున్నారు. కాగా కొత్తగా మెడికల్ కాలేజీలు ఏర్పాటయ్యే చోట ప్రస్తుతం ఏరియా ఆస్పత్రుల తోపాటు జిల్లా ఆస్పత్రులు, సామాజిక ప్రజారోగ్యకేంద్రాలు ఉన్నాయి. అయితే కాలేజీల ఏర్పాటుతో వీటిని 500 పడకల ఆస్పత్రుల స్థాయికి మార్చరాలని రాష్ట్ర ప్రభుత్వం యోచిస్తోంది.