Accident In Prakasam : పెళ్లి బృందంతో వెళ్తున్న వాహనం బోల్తా…పెళ్లి కూతురు తమ్ముడు సహా నలుగురి మృతి

ప్రకాశం జిల్లా కొనకళ్లమెట్ల మండలం నాగిరెడ్డి పల్లిలో పెళ్లింట విషాదం జరిగింది. పెళ్లిరి వెళ్తుండగా బొలెరో వాహనం బోల్తా పడటంతో నలుగురు వ్యక్తులు మృతి చెందారు.

Accident In Prakasam : పెళ్లి బృందంతో వెళ్తున్న వాహనం బోల్తా…పెళ్లి కూతురు తమ్ముడు సహా నలుగురి మృతి

Road Accident

Updated On : August 25, 2021 / 1:16 PM IST

Four killed in a road accident : ప్రకాశం జిల్లా కొనకళ్లమెట్ల మండలం నాగిరెడ్డి పల్లిలో పెళ్లింట విషాదం జరిగింది. దోర్నాలకు చెందిన పెళ్లిబృందం పొదిలి మండలం అక్కచెరువు గ్రామానికి బొలెరో వాహనంలో వెళ్తుండగా ప్రమాదం చోటుచేసుకుంది. బొలెరో వాహనం బోల్తా పడటంతో.. ఇద్దరు వ్యక్తులు అక్కడికక్కడే మృతి చెందారు. మరో ఇద్దరు మార్కాపురం ఆస్పత్రికి తరలిస్తుండగా మృతి చెందారు.

ప్రమాదంలో పెళ్లికూతురు తన తమ్ముడు అనిల్ ను కోల్పోయింది. కళ్ల ముందే తోడబుట్టిన వాడి ప్రాణాలు గాలిలో కలసిపోవడాన్ని చూసి.. గుండెలవిసేలా రోధిస్తోంది. సందడిగా ఉండాల్సిన పెళ్లింట విషాదం నెలకొనడం.. తమ్ముడి కోసం పెళ్లి కూతురు ఏడుస్తున్న తీరు అందరిని కలచివేస్తోంది.

పెద్దఆర్వేడు మండలం సోమేపల్లి నుంచి అక్కాపల్లికి వెళ్తున్న సమయంలో కొనకళ్లమెట్ల మండలం గార్లదిన్నె చేరుకున్న తర్వాత ఫ్లై వోవర్ బ్రిడ్జీ ఉంది. బ్రిడ్జీపై ప్రయాణిస్తుండగా స్పీడ్ బ్రేక్స్ దాటుతున్న క్రమంలో బోలేరో వాహనం డ్రైవర్ స్లో చేయకుండా స్పీడ్ వెళ్తున్నక్రమంలో వాహనం కుదుపులకు గురై బోల్తా పడింది.

దీంతో నలుగురు వ్యక్తులు వెనకవైపు జారి పడ్డారు. వీరిలో ఇద్దరు అక్కడికక్కడే మృతి చెందారు. మరో ఇద్దరికి విషమంగా ఉండటంతో చికిత్స నిమిత్తం మార్కాపురం జిల్లా ఆస్పత్రికి తరలిస్తుండగా మార్గంమధ్యలో చనిపోయారు. కొద్ది సేపట్లో పెళ్లి అన్నంగా ఈ విషాధ ఘటన నెలకొనడం అందరినీ కలిచి వేస్తోంది.