East Godavari : గోదావరిలో నలుగురు విద్యార్థులు గల్లంతు

తూర్పు గోదావరి జిల్లాలో విషాద ఘటన చోటుచేసుకుంది. పి.గన్నవరం మండలం లంకల గన్నవరం గ్రామానికి చెందిన పంతాల పవన్, యర్రంశెట్టి రత్న సాగర్, బండారు నవీన్ కుమార్, ఖండవల్లి వినయ్ అనే నలుగురు 10వ తరగతి విద్యార్థులు గోదావరిలో స్నానం చేసేందుకు వెళ్లారు.

East Godavari : గోదావరిలో నలుగురు విద్యార్థులు గల్లంతు

East Godavari

Updated On : June 28, 2021 / 1:44 PM IST

East Godavari : తూర్పు గోదావరి జిల్లాలో విషాద ఘటన చోటుచేసుకుంది. పి.గన్నవరం మండలం లంకల గన్నవరం గ్రామానికి చెందిన పంతాల పవన్, యర్రంశెట్టి రత్న సాగర్, బండారు నవీన్ కుమార్, ఖండవల్లి వినయ్ అనే నలుగురు 10వ తరగతి విద్యార్థులు గోదావరిలో స్నానం చేసేందుకు వెళ్లారు. ప్రమాదవశాత్తు గోదావరిలో గల్లంతయ్యారు.

విద్యార్థులు గల్లంతైన విషయం తెలుసుకున్న పోలీసులు ఘటనాస్థలికి చేరుకొని గజఈతగాళ్ల సమాయంతో పవన్, రత్నసాగర్, నవీన్‌ల మృతదేహాలను వెలికితీశారు. ఖండవిల్లి వినయ్ కోసం గాలిస్తున్నారు. బయటకి వెళ్లివస్తామని చెప్పిన విద్యార్థులు విగతజీవులుగా మారడంతో కుటుంబాల్లో విషాద ఛాయలు అలుముకున్నాయి.

ఇక ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న అధికారులు విచారణ చేపట్టారు. మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.