ఏపీలో ఉచిత బస్సు ప్రయాణం.. గైడ్‌లైన్స్ వచ్చేశాయ్.. ఏ బస్సుల్లో ఫ్రీ.. ఏ బస్సుల్లో కాదు.. ఫుల్ డీటెయిల్స్ ..

స్త్రీ శక్తి పథకం కింద మహిళలకు ఉచిత బస్సు ప్రయాణంను ప్రభుత్వం ఈనెల 15వ తేదీ నుంచి అందుబాటులోకి తీసుకురానుంది.

ఏపీలో ఉచిత బస్సు ప్రయాణం.. గైడ్‌లైన్స్ వచ్చేశాయ్.. ఏ బస్సుల్లో ఫ్రీ.. ఏ బస్సుల్లో కాదు.. ఫుల్ డీటెయిల్స్ ..

Free bus travel Scheme

Updated On : August 11, 2025 / 2:34 PM IST

AP Free bus Scheme: ఏపీలోని కూటమి ప్రభుత్వం ఎన్నికల సమయంలో ఇచ్చిన ఒక్కో హామీని అమలు చేస్తోంది. తాజాగా స్త్రీ శక్తి పథకం కింద మహిళలకు ఉచిత బస్సు ప్రయాణంను ఈనెల 15వ తేదీ నుంచి అమల్లోకి తీసుకురానుంది. ఈ పథకాన్ని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ప్రారంభించనున్నారు.

స్త్రీ శక్తి పథకంకు సంబంధించిన అధికారిక జీవోను రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేసింది. అందులో ఈనెల 15వ తేదీ నుంచి ఉచిత బస్సు ప్రయాణం అందుబాటులోకి వస్తుందని తెలిపింది. ఇందుకు సంబంధించి గైడ్ లైన్స్‌ను విడుదల చేసింది. మహిళలకు ఏ బస్సులో ఉచిత ప్రయాణం ఉంటుంది.. ఏ బస్సుల్లో ఉచిత ప్రయాణం ఉండదు..? ఏఏ రూట్లలో ఉచిత ప్రయాణ సౌకర్యం అందుబాటులో ఉండదు.. అనే విషయాలపై క్లారిటీ ఇచ్చారు.

గైడ్ లైన్స్ ఇవే..
♦ స్త్రీశక్తి పథకంలో భాగంగా మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం రాష్ట్ర వ్యాప్తంగా అమలు చేయడం జరుగుతుంది. అయితే, ఐదు కేటగిరీలకు చెందిన బస్సుల్లో ఈ సదుపాయం ఉంటుంది.
♦ ఆంధ్రప్రదేశ్‌లో నివాసం ఉంటూ.. రాష్ట్రంలోని వాసిగా గుర్తింపు కార్డు కలిగిన బాలికలు, మహిళలు మరియు ట్రాన్స్‌జెండర్స్‌లు ఈ ఉచిత బస్సు ప్రయాణానికి అర్హులు.
♦ ప్రస్తుతం ఏపీఎస్ఆర్టీసీ వద్ద ఉన్న బస్సుల ద్వారా మహిళలకు ఉచిత ప్రయాణ సౌకర్యాన్ని అందించడం జరుగుతుంది. రాబోయే కాలంలో ప్రయాణికుల అవసరాలకు తగినట్లుగా బస్సులను అందుబాటులోకి తేస్తారు.
♦ స్త్రీశక్తి పథకం కింద కొన్ని రకాల బస్సులు.. అంటే.. ఆర్డినరీ, పల్లెవెలుగు, అల్ట్రా పల్లెవెలుగు, మెట్రో ఎక్స్‌ప్రెస్, ఎక్స్‌ప్రెస్ బస్సు సర్వీసుల్లో మహిళలు ఉచితంగా ప్రయాణించొచ్చు.
♦ అన్ని నాన్-స్టాప్ బస్సులు, ఇంటర్‌స్టేట్ ఎక్స్‌ప్రెస్ బస్సులు.. రాష్ట్రం నుంచి కర్ణాటక, తమిళనాడు, తెలంగాణ వంటి ఇతర రాష్ట్రాలకు వెళ్లే ఎక్స్‌ప్రెస్ బస్సుల్లో ఈ పథకం వర్తించదు. కాంట్రాక్ట్ క్యారేజ్ సర్వీసులు, చార్టర్డ్ సర్వీసులు (ప్రత్యేకంగా బుక్ చేసుకునే బస్సులు), ప్యాకేజీ టూర్లకు బుక్ చేసుకునే బస్సుల్లో మహిళలకు ఉచిత ప్రయాణం సౌకర్యం అందుబాటులో ఉండదు.
♦ సప్తగిరి ఎక్స్‌ప్రెస్, ఆల్ట్రా డీలక్స్, సూపర్ లగ్జరీ, స్టార్ లైనర్, అన్ని ఏసీ బస్సుల్లో ఈ పథకం వర్తించదు.
♦ ఉచిత ప్రయాణంకు అర్హత కలిగిన మహిళలకు జీరో ఫేర్ టికెట్లను జారీ చేయడం జరుగుతుంది. ఆ ఖర్చును ఆర్టీసీకి రాష్ట్ర ప్రభుత్వం రీయింబర్స్ చేయనున్నట్లు ప్రకటించింది.

♦ ఆర్టీసీ బస్సుల్లో ఉండే మహిళా కండక్టర్ల యూనిఫామ్‌కు కెమెరాలు అటాచ్ చేయడంతోపాటు.. అన్ని బస్ స్టేషన్లలో సదుపాయాలు మెరుగుపర్చాలని ఏపీఎస్ఆర్టీసీకి ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది.