గాజువాక పీపుల్స్ మ్యానిఫెస్టో – 2024 విడుదల చేసిన మంత్రి గుడివాడ అమర్ నాథ్.. కీలక హామీలు ఇవే..

ఉద్యోగ అవకాశాలకోసం ఎదురు చూస్తున్న యువతకు ’విజయ వారధి’ కార్యక్రమం ద్వారా ఉపాధి కల్పిస్తామని మంత్రి గుడివాడ అమర్ నాథ్ అన్నారు.

గాజువాక పీపుల్స్ మ్యానిఫెస్టో – 2024 విడుదల చేసిన మంత్రి గుడివాడ అమర్ నాథ్.. కీలక హామీలు ఇవే..

Minister Gudivada Amarnath

Minister Gudivada Amarnath : ఏపీలో జరుగుతున్న అసెంబ్లీ ఎన్నికల్లో గాజువాక నియోజకవర్గం వైసీపీ అభ్యర్థిగా మంత్రి గుడివాడ అమర్ నాథ్ పోటీ చేస్తున్న విషయం తెలిసిందే. కొద్దిరోజులుగా నియోజకవర్గంగా అమర్ నాథ్ విస్తృత ప్రచారం నిర్వహిస్తున్నారు. ప్రచారంలో భాగంగా అమర్ నాథ్ కు నియోజకవర్గ ప్రజలు ఘన స్వాగతం పలుకుతున్నారు. గురువారం గాజువాక పార్టీ కార్యాలయంలో నియోజకవర్గంకు సంబంధించిన ప్రత్యేకంగా మ్యానిఫెస్టోను మంత్రి విడుదల చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. గాజువాక నియోజకవర్గం ప్రజల అభిప్రాయాలు సేకరించి మ్యానిఫెస్టోను తయారు చేయడం జరిగిందని చెప్పారు. ఉగాది రోజున ఒక వెబ్ సైట్ ప్రారంభించి, అభిప్రాయాలు సేకరణ మొదలు పెట్టామని అమర్ నాథ్ అన్నారు.

Also Read : CM Jagna : ఎన్నికల ప్రచారంలో గేరు మార్చనున్న సీఎం జగన్.. ఇకనుంచి రోజుకు నాలుగు బహిరంగ సభలు!

  • మ్యానిఫెస్టోలో హామీలు..
  • ఉద్యోగ అవకాశాలకోసం ఎదురు చూస్తున్న యువతకు ‘విజయ వారధి’ కార్యక్రమం ద్వారా ఉపాధి కల్పిస్తాం.
  • స్వయం ఉపాధి దిశగా అడుగులువేసే యువతను ప్రోత్సహిస్తాం
  • గాజువాకలో డిజిటల్ మీడియా స్టూడియోస్ ఏర్పాటు చేస్తాం.
  • కాలుష్యాన్ని నివారించడానికి చర్యలు తీసుకుంటాం.
  • గాజువాకలో డిగ్రీ కాలేజ్, పాలిటెక్నిక్ కాలేజ్ ఏర్పాటు చేస్తాం.
  •  సామాజిక వర్గాల వారిగా కమ్యూనిటీ హల్స్ ఏర్పాటు చేస్తాం.
  • గాజువాకలో ప్రధానమైన సమస్య ట్రాఫిక్. ఆ సమస్యను అధిగమించడానికి గాజువాకలో ప్లేఓవర్ నిర్మిస్తాం.
  • గాజువాకలో మల్టీలెవల్ కారు పార్కింగ్ ఏర్పాటు చేస్తాం.
  • రైతు బజారులను ఆధునీకరిస్తాం.
  • ఆక్వా స్పోర్ట్స్ కాంప్లెక్స్ ఏర్పాటు చేస్తాం.
  • గాజువాకలో కన్వెన్షన్ సెంటర్ ను నిర్మిస్తాం.
  • గాజువాక ఉత్సవ్ ను ప్రతి సంవత్సరం ఘనంగా నిర్వహిస్తాం.
  •  యారాడ తీరాన్ని అభివృద్ధి చేస్తాం.