Ganesh Chaturthi: 10TV.in వీక్షకులకు వినాయక చవితి శుభాకాంక్షలు

హిందువులు జరుపుకునే ముఖ్యమైన పండుగలో వినాయక చవితి ఒకటి. ఏ శుభకార్యాలు అయినా యజ్ఞయాగాదులు అయినా మొదలు పెట్టాలంటే కచ్చితంగా మొదట వినాయకుడిని పూజించాలి.

Ganesh Chaturthi: 10TV.in వీక్షకులకు వినాయక చవితి శుభాకాంక్షలు

Ganesh Chaturthi Wishes 10tv In Viewers

Updated On : September 10, 2021 / 6:50 AM IST

Ganesh Chaturthi: హిందువులు జరుపుకునే ముఖ్యమైన పండుగలో వినాయక చవితి ఒకటి. ఏ శుభకార్యాలు అయినా యజ్ఞయాగాదులు అయినా మొదలు పెట్టాలంటే కచ్చితంగా మొదట వినాయకుడిని పూజించాలి. అంతేకాదు మనం హిందూవులు కొత్తగా ఏ పని మొదలుపెట్టినా.. ఆ పని ఏ విఘ్నాలు లేకుండా పూర్తి కావాలంటే వినాయకుడు అండగా ఉండాలని తొలి పూజ చేస్తారు. మనం దేశంలో అనేక ప్రాంతాలలో వినాయక చవితిని తరతరాలుగా జరుపుకుంటూనే వున్నారు.

కేవలం భారతదేశం మాత్రమే కాకుండా చైనా, నేపాల్ వంటి వివిధ దేశాలలో కూడా వినాయకుడిని పూజించడం జరుగుతుంది. పార్వతి, పరమేశ్వరుల కుమారుడైన వినాయకుని పుట్టినరోజునే వినాయక చవితిగా జరుపుకుంటారు. భాద్రపదమాసం శుక్ల చతుర్థి మధ్యాహ్న శుభ సమయంలో హస్త నక్షత్రం రోజున చవితి ఉత్సవాలు ప్రారంభమవుతాయి.

ప్రజలందరికి వినాయక చవితి శుభాకాంక్షలు తెలుపుతుంది మీ ‘10TV.in’. గత ఏడాది కరోనా కారణంగా చవితి సంబరాలు జరుపుకోలేకపోయాం. కానీ ఈసారి ఊరు, వాడ, పల్లె, పట్టణం ఇలా అన్ని ప్రాంతాలలో కరోనా జాగ్రత్తలు పాటిస్తూ గణేష్ నవరాత్రి సంబరాలు జరుపుకునేందుకు సిద్దమయ్యాం. ఇక రెండు తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులతో పాటు రాజకీయ ప్రముఖులు, సినీ ప్రముఖులు సైతం ప్రజలందరికి వినాయక చవితి శుభాకాంక్షలు తెలిపారు.