Rape Attempt : యువకుడిని బంధించి యువతిపై అత్యాచారయత్నం.. కృష్ణా జిల్లాలో రెచ్చిపోయిన గంజాయి బ్యాచ్

కృష్ణా జిల్లా గన్నవరంలోని ముస్తాబాద్ లో గంజాయి బ్యాచ్ రెచ్చిపోయింది. ప్రేమజంటపై దాడి చేసి యువతిపై అత్యాచారయత్నానికి ఒడిగట్టింది.

Rape Attempt : యువకుడిని బంధించి యువతిపై అత్యాచారయత్నం.. కృష్ణా జిల్లాలో రెచ్చిపోయిన గంజాయి బ్యాచ్

Updated On : October 22, 2022 / 7:14 PM IST

Rape Attempt : కృష్ణా జిల్లా గన్నవరంలోని ముస్తాబాద్ లో గంజాయి బ్యాచ్ రెచ్చిపోయింది. ప్రేమజంటపై దాడి చేసి యువతిపై అత్యాచారయత్నానికి ఒడిగట్టింది. ఓ ప్రేమజంట నిర్మానుష్య ప్రదేశానికి వెళ్లడాన్ని గమనించిన గంజాయి బ్యాచ్ వారిపై దాడి చేసింది. అత్యాచారయత్నానికి ప్రయత్నిండంతో యువతి గట్టిగా కేకలు వేసింది. కేకలు విన్న అటుగా వెళ్తున్న స్థానికులు పరుగున వచ్చారు. యువతిని రక్షించారు.

స్థానికులు రావడంతో గంజాయి బ్యాచ్ పారిపోయింది. నిందితుల్లో ఒకరిని పట్టుకున్న స్థానికులు దేహశుద్ధి చేశారు. అతడిని పోలీసులకు అప్పగించారు. మిగిలిన వాళ్లు పారిపోయారు. నిందితులు వచ్చిన ఆటోను పోలీసులకు అప్పగించారు స్థానికులు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు విచారణ చేపట్టారు.

10TV LIVE : నాన్ స్టాప్ న్యూస్ అప్‌డేట్స్ కోసం 10TV చూడండి.

”ఓ ప్రేమజంట నిర్మానుష్య ప్రదేశానికి వెళ్తుండగా.. గంజాయి మత్తులో ఉన్న యువకులు వారిని ఆటోలో వెంబడించారు. ప్రేమజంటపై దాడి చేశారు. వారి దగ్గరున్న డబ్బు లాక్కున్నారు. అంతటితో ఆగలేదు. యువకుడిని తాళ్లతో బంధించారు. యువతిపై అత్యాచారయత్నానికి యత్నించారు. అంతలో.. యువతి బిగ్గరగా కేకలు వేయడంతో స్థానికులు అక్కడికి వెళ్లి చూడగా.. యువతిపై నిందితుడు చేస్తున్న దారుణం కనిపించింది. వెంటనే వారు యువతిని రక్షించారు. నిందితుల్లో ఒకడు పట్టుబడ్డాడు. యువతి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నం. పరారీలో ఉన్న నిందితుడి కోసం గాలింపు చర్యలు చేపట్టాం” అని పోలీసులు వెల్లడించారు.

గంజాయి మత్తులో ఉన్న నిందితులు ప్రేమజంటను వెంబడించడం, దాడి చేయడం, యువతిపై అత్యాచారయత్నం చేయడం స్థానికంగా కలకలం రేపింది. యువతీ యువకులు అప్రమత్తంగా ఉండాలని, నిర్మానుష్య ప్రాంతాల వైపు వెళ్లొద్దని పోలీసులు సూచించారు.