Ganta Srinivasa Rao : పవన్ కళ్యాణ్ నిర్ణయానికి మనస్ఫూర్తిగా అభినందనలు : గంటా శ్రీనివాస రావు

జనసేన కలయికతో టీడీపీ మరింత బలం పెరుగుతుందన్నారు. ఈ ప్రకటనతో వైసీసీ గుండెళ్ళో రైళ్లు పరుగెడతాయని చెప్పారు.

Ganta Srinivasa Rao : పవన్ కళ్యాణ్ నిర్ణయానికి మనస్ఫూర్తిగా అభినందనలు : గంటా శ్రీనివాస రావు

Ganta Srinivasa Rao

Updated On : September 14, 2023 / 2:35 PM IST

Ganta Srinivasa Rao – Pawan Kalyan : టీడీపీ – జనసేన కలయిపై గంటా శ్రీనివాస రావు స్పందించారు. ఏపీ రాజకీయాల్లో ఈ రోజు మరిచిపోలేని రోజు అని అన్నారు. చంద్రబాబుతో భేటీ తరువాత పవన్ కళ్యాణ్ కీలక నిర్ణయం తీసుకున్నారని తెలిపారు. ఇంత కాలం ఉన్న అనుమానాలు సందేహలు పటాపంచలు అయ్యాయని అన్నారు. పవన్ కళ్యాణ్ నిర్ణయంపై మనస్ఫూర్తిగా అభినందనలు తెలియజేస్తున్నానని చెప్పారు.

ఈ ప్రకటన వైసీపీకీ చమరగీతం పలకాడానికి నాంది అని పేర్కొన్నారు. బీజేపీ కలిసి వస్తుందని తాను అనుకున్నానని చెప్పారు. రాష్ట్రంలో జరుగుతున్న అరచకాలను సైతం బీజేపీ గమనిస్తుందన్నారు. వైసీపీ పట్ల బీజేపీ వ్యతిరేకంగా ఉందని తెలిపారు. అమిత్ షా, జేపీ నడ్డ సైతం రాష్ట్రంలో జరుగుతున్న పరిణామాలపై స్పందించారని వెల్లడించారు.

Pawan Kalyan: జైల్లో చంద్రబాబు భద్రత విషయంపై పవన్ కల్యాణ్ కీలక వ్యాఖ్యలు

ఈ సారి వైసీపీ సింగిల్ డిజిట్ కే పరిమితం అవుతుందన్నారు. తమకు 160 సీట్లు వస్తాయని నమ్మకం ఉందని తెలిపారు. జనసేన కలయికతో టీడీపీ మరింత బలం పెరుగుతుందన్నారు. ఈ ప్రకటనతో వైసీసీ గుండెళ్ళో రైళ్లు పరుగెడతాయని చెప్పారు.

బీజేపీ, టీడీపీ, జనసేన కలిసి పోటీ చేయాలని తన కోరిక అని పవన్ కళ్యాణ్ అన్నారు. వైసీపీ అరాచకాలను ఎదిరించాలంటే విడివిడిగా పోటీ చేస్తే పని చేయదన్నారు. సమిష్టిగా ఎదుర్కొవాల్సిన సమయం ఆసన్నమైందన్నారు. ఎన్నికల్లో జనసేన, టీడీపీ కలిసే వెళ్తాయని… ఈ రోజు తాను నిర్ణయం తీసుకున్నాని చెప్పారు.