లాక్‌డౌన్‌లో మెయింటెనెన్స్ చేయకపోవడం వల్లే గ్యాస్ లీక్ : కంపెనీ జీఎం

  • Published By: srihari ,Published On : May 7, 2020 / 08:23 AM IST
లాక్‌డౌన్‌లో మెయింటెనెన్స్ చేయకపోవడం వల్లే గ్యాస్ లీక్ : కంపెనీ జీఎం

Updated On : May 7, 2020 / 8:23 AM IST

విశాఖలోని ఎల్‌జీ పాలిమర్స్‌లో విష వాయువు లీకేజీపై ఆ కంపెనీ జీఎం మోహన్ రావు స్పందించారు. లాక్‌డౌన్ నేపథ్యంలో కంపెనీలోని ట్యాంకులు రన్నింగ్‌లో లేకపోవడం వల్లే ఈ ప్రమాదం జరిగిందన్నారు. ట్యాంక్ కెపాసిటీ 2400 టన్నులు కాగా, 1800 టన్నుల స్టెరిన్ మోనోమార్ ఉందని చెప్పారు. లాక్ డౌన్‌లో మెయింటెనెన్స్ చేయకపోవడంతోనే గ్యాస్ లీక్ అయిందని తెలిపారు.

..న్హిబ్యూటర్‌తో కంట్రోల్ చేస్తున్నామని చెప్పారు. గ్యాస్ లీకేజీ అదుపులోకి రావడానికి మరో నాలుగు గంటల సమయం పడుతుంది ఎల్‌జీ పాలిమర్స్ జీఎం స్పష్టం చేశారు. మరోవైపు కంపనీ నిర్లక్ష్యంగా వ్యవహారించడం కారణంగానే ఈ దారుణం జరిగిందని విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ప్రమాదకరమైన గ్యాస్ లీక్ అయ్యే ప్రమాదం ఉందనే తెలిసి కూడా పట్టించుకోలేదని ఆరోపిస్తున్నారు. 

విష వాయువు లీక్ కావడంతో స్థానికంగా ఉండే చాలామంది పిట్టల్లా రాలిపోయారు. విష వాయువును పీల్చిన వారంతా అస్వస్థతకు గురయ్యారు. ఇప్పటివరకూ 8 మంది మృతిచెందగా, అందులో ఒక చిన్నారి కూడా ఉంది. వివిధ ఆస్పత్రుల్లో 316 మందికి చికిత్స అందిస్తున్నారు. ఆర్.ఆర్ వెంకటాపురంలోని ఎల్జీ పాలిమర్స్ కంపెనీలో అర్ధరాత్రి 3.30 గంటలకు స్టైరిన్ మోనోమర్ గ్యాస్ లీక్ అయింది.

విష వాయువు లీక్ అవ్వడంతో జనమంతా ఉక్కిబిక్కిరి అవుతున్నారు. ప్రమాద సమయంలో ప్రజలందరూ గాఢ నిద్రలో ఉన్నారు. కొంతమంది కళ్లు కనపడక బావిలో పడి యువకుడు మృతిచెందాడు. బిల్డింగ్ పై నుంచి పడిపోయి మరికొందరు గాయపడ్డారు. రోడ్లపై ఎక్కడిక్కడ ప్రజలు కుప్పకూలిపోయారు. 

Also Read | విశాఖ ఘటనపై టాలీవుడ్ దిగ్భ్రాంతి