Gold Price Today: బంగారం, వెండి కొనుగోలు చేస్తున్నారా..? తెలుగు రాష్ట్రాల్లో తులం బంగారం ఎంతో తెలుసా..
శ్రావణ మాసం వేళ బంగారం, వెండి కొనుగోలు చేసేందుకు మహిళలు ఎక్కువ ఆసక్తిచూపుతారు. దీనికితోడు ప్రస్తుతం పెళ్లిళ్ల సీజన్ కావడంతో

Gold price today
Gold and Silver Prices Today: శ్రావణ మాసం వేళ బంగారం, వెండి కొనుగోలు చేసేందుకు మహిళలు ఎక్కువ ఆసక్తిచూపుతారు. దీనికితోడు ప్రస్తుతం పెళ్లిళ్ల సీజన్ కావడంతో బంగారం దుకాణాలు రద్దీగా మారాయి. అయితే, బంగారం, వెండి కొనుగోలు చేసే వారికి కాస్త ఊరట లభిస్తుంది. అంతర్జాతీయ బులియన్ మార్కెట్ లో బంగారం ధరలు స్థిరంగా ఉన్నాయి. స్పాట్ గోల్డ్ రేటు ఒక ఔన్సుకు 1914 డాలర్ల వద్ద కొనసాగుతోంది. ఇక స్పాట్ సిల్వర్ రేటుసైతం 24.23 డాలర్ల మార్క్ వద్ద అమ్ముడవుతోంది. భారత కరెన్సీ రూపాయి మారక విలువ ఇవాళ రూ. 82.623 మార్క్ వద్ద ట్రేడవుతోంది.

Gold
తెలుగు రాష్ట్రాల్లో బంగారం ధరలను పరిశీలిస్తే.. హైదరాబాద్, విజయవాడ, విశాఖపట్టణం ప్రాంతాల్లో బంగారం ధరలు స్థిరంగా కొనసాగుతున్నాయి. 10గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర రూ. 54,500 కాగా, 24 క్యారెట్ల గోల్డ్ ధర రూ. 59,450గా ఉంది.

Gold
దేశంలోని వివిధ ప్రధాన నగరాల్లో బంగారం ధరలను పరిశీలిస్తే..
– దేశ రాజధాని ఢిల్లీలో పది గ్రాముల 22క్యారెట్ల బంగారం ధర రూ. 54,650 కాగా, 24 క్యారెట్ల పసిడి ధర రూ. 59,600గా ఉంది.
– ముంబైలో పది గ్రాముల 22 క్యారెట్ల గోల్డ్ ధర రూ. 54,500 కాగా, 24 క్యారెట్ల గోల్డ్ ధర రూ. 59,450గా ఉంది.
– బెంగళూరులో పది గ్రాముల 22 క్యారెట్ల గోల్డ్ ధర రూ. 54,500 కాగా, 24 క్యారెట్ల గోల్డ్ ధర రూ. 59,450గా ఉంది.
– చెన్నైలో 10 గ్రాములు 22 క్యారెట్ల గోల్డ్ ధర రూ. 54,800 కాగా, 24 క్యారెట్ల పసిడి ధర రూ. 59,780గా ఉంది.
– కోల్కతాలో 10గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర రూ. 54,500 కాగా, 24 క్యారెట్ల గోల్డ్ ధర రూ. 59,450గా ఉంది.

Gold
ప్రధాన నగరాల్లో వెండి ధరలను పరిశీలిస్తే.. హైదరాబాద్, విజయవాడ, విశాఖపట్టణంలలో కిలో వెండి ధర రూ. 80వేల వద్ద కొనసాగుతోంది. ఢిల్లీలో కిలో వెండి ధర రూ. 76,900 కాగా, ముంబైలో రూ. 76,400, చెన్నైలో రూ. 80వేలు, బెంగళూరులో కిలో వెండి ధర రూ. 75,500 లుగా ఉంది.