Kakinada Tdp: కాకినాడ జిల్లాలో కూటమిని వేధిస్తున్న లోటు ఏంటి? ఆ ఇద్దరు కీలక నేతలు ఎందుకు సైలెంట్ అయ్యారు?
పవన్ కల్యాణ్ డిప్యూటీ సీఎంగా, జనసేన చీఫ్‌గా ఉన్నారు. ఆయన దగ్గరికి వెళ్లి సమస్యలు చెప్పుకోవడం అంత ఈజీ కాదు.
- టీడీపీకి పెద్ద దిక్కుగా ఉండే నేతలు సైలెంట్ అయ్యారా.?
- మూడు పార్టీల మధ్య కోఆర్డినేషన్‌ను సెట్ చేసే వాళ్లే లేరా.?
- చిన్న సమస్య వచ్చినా అధిష్టానం దగ్గరికి వెళ్లాల్సి వస్తోందా.?
Kakinada Tdp: మూడు పార్టీలు. ఎన్నో ఇష్యూస్. అన్నీ సెట్‌రైట్ చేసే సీనియర్ లీడర్లు గతంలో మాదిరిగా యాక్టివ్ పాలిటిక్స్ చేయట్లేదు. ఒకప్పుడు ఆ జిల్లాలో ఏ సమస్య వచ్చినా సాల్వ్ చేసే నేతలు కాస్త సైలెంట్ మోడ్‌లో ఉండటంతో..ఇప్పుడు క్యాడర్, లీడర్లు ఇబ్బంది పడుతున్నారట. ప్రతీ దానికి అధిష్టానం దగ్గరికి వెళ్లి చెప్పుకోవాల్సి వస్తోందట. ఇంతకు ఏ జిల్లాలో ఈ పరిస్థితి ఉంది? ఆ ఇద్దరు నేతలు ఎందుకు మౌనంగా ఉన్నట్లు?
కాకినాడ జిల్లా కాపుల జిల్లాగా రాష్ట్రంలోనే ప్రత్యేకమైన పేరు ఉంది. ఇదే జిల్లా నుంచి రాష్ట్ర డిప్యూటీ సీఎం, జనసేన అధినేత పవన్ కల్యాణ్ పిఠాపురం ఎమ్మెల్యేగా ప్రాతినిధ్యం వహిస్తున్నారు. రాష్ట్ర ప్రభుత్వంలో డిప్యూటీ సీఎంగా ఐదు శాఖల మంత్రిగా ఉన్నారు పవన్. రాష్ట్రంలో ఒక పార్టీకి అధినేతగా, డిప్యూటీ సీఎంగా కీలక బాధ్యతలు ఉన్న సేనాని ప్రతిరోజు బిజీ బిజీగా ఉంటారు. దీంతో కాకినాడ జిల్లా కూటమిలో..ఇటు టీడీపీ పార్టీలో ఏదైనా సమస్య వస్తే సాల్వ్ చేసే పెద్ది దిక్కు లేకుండా పోయిందట.
పెద్ద దిక్కుగా ఉన్న యనమల, నిమ్మకాయల చినరాజప్ప..
గతంలో టీడీపీ నుంచి యనమల రామకృష్ణుడు, నిమ్మకాయల చినరాజప్ప ఇద్దరూ వయస్సు రిత్యా, ఆరోగ్యం దృష్ట్యా నియోజకవర్గాలకే పరిమితం అవుతున్నారు. కాకినాడ జిల్లాకే చెందిన జగ్గంపేట ఎమ్మెల్యే జ్యోతుల నెహ్రూ, ఎంపీ సానా సతీష్ కీలకంగా వ్యవహరిస్తున్నారు. జగ్గంపేట ఎమ్మెల్యేగా, టీటీడీ పాలక మండలి సభ్యుడిగా జ్యోతుల నెహ్రూ కొనసాగుతుండగా..సానా సతీష్ రాజ్యసభ సభ్యుడిగా కొనసాగుతున్నారు. వాళ్లు వారి పని వారు చేసుకుంటున్నారట. జిల్లా ఇంచార్జ్‌గా మంత్రి నారాయణ ఉన్నప్పటికీ..పని భారంతో ఆయన ఇక్కడి నేతలకు పెద్దగా టైమ్ ఇవ్వలేకపోతున్నారట. అయితే గతంలో కాకినాడ జిల్లాకు ఆర్థిక మంత్రిగా యనమల రామకృష్ణుడు, హోం మంత్రిగా నిమ్మకాయల చినరాజప్ప పెద్దదిక్కుగా ఉండేవారు. ఏ సమస్య వచ్చినా వారి దగ్గరికి కార్యకర్తలు వెళ్లే వారు. ఇద్దరు నేతలు పరిష్కారం చూపి ఆ సమస్యను క్షేత్ర స్థాయిలోనే తీర్చేవారు. ప్రస్తుతం కాకినాడ జిల్లాలో ఆ పరిస్థితి లేదంటున్నారు.
అధినేతలకు తలనొప్పిగా కూటమి కార్యకర్తల వివాదాలు..
కూటమిలో మూడు పార్టీలు మంచి కోఆర్డినేషన్‌తో ముందుకెళ్తున్నప్పటికీ..అక్కడక్కడ చిన్న చిన్న సమస్యలు వచ్చినప్పుడు..పరిష్కారం చూపించే సరైన పెద్ద దిక్కు లేని లోటు స్పష్టంగా కనిపిస్తోందట. కూటమి కార్యకర్తల మధ్య ఏదో వివాదం అధినేతలకు తలనొప్పిగానే మారుతుందట. క్షేత్రస్థాయిలో సెటిల్ చేయాల్సిన సమస్యలు కూడా అధిష్టానం దృష్టికి వెళ్లాల్సిన పరిస్థితి ఎదురవుతోందట. జనసేన, టీడీపీ నేతల మధ్య ఎన్ని విభేదాలు ఉన్నప్పటికీ పరిష్కరించే నాయకుడు లేక క్యాడర్ సతమతం అవుతోందట. ఎవరి దగ్గరికి వెళ్తే సొల్యూషన్ దొరుకుతుందో తెలియక క్యాడర్ డైలమాలో పడిపోయిందట. అయితే ఇటీవల కాలంలో కాకినాడ జిల్లాలోనే పలు ఇష్యూస్ రాష్ట్ర స్థాయి వివాదాలకు దారితీశాయి. అధిష్టానం వీటన్నింటికీ చెక్ పెట్టాలంటే సరైన బాధ్యత కలిగిన సీనియర్ నేతలకు బాధ్యతలు అప్పగించాల్సి అవసరం ఎంతైనా ఉందని అంటున్నారు కూటమి కార్యకర్తలు.
యనమల, చినరాజప్పలకు బాధ్యతలు ఇవ్వాలని రిక్వెస్ట్..
పవన్ కల్యాణ్ డిప్యూటీ సీఎంగా, జనసేన చీఫ్‌గా ఉన్నారు. ఆయన దగ్గరికి వెళ్లి సమస్యలు చెప్పుకోవడం అంత ఈజీ కాదు. పైగా జనసేన నేతలతోనే ఏదైనా సమస్య ఉంటే నేరుగా పవన్ దృష్టికి తీసుకెళ్లే పరిస్థితి ఉండదు. జిల్లాలో జనసేన ఎమ్మెల్యేల ఆధిపత్యమే ఎక్కువగా నడుస్తుందన్న ఫీలింగ్ కూడా తెలుగు తమ్ముళ్లలో ఉందట. సీనియర్ టీడీపీ నేతలుగా ఉండి..జనసేన ఎమ్మెల్యేలు, లీడర్ల దగ్గరికి వెళ్లేందుకు వెనుకా ముందు ఆడుతున్నారట. అందుకే టీడీపీలోనే సీనియర్ లీడర్లుగా పేరుండి..జిల్లా రాజకీయాలపై పూర్తి అవగాహన ఉన్న యనమల, చినరాజప్పలకు ఏవైనా బాధ్యతలు ఇచ్చి..కోఆర్డినేషన్ మిస్ కాకుండా..క్యాడర్, లీడర్ల సమస్యలు సాల్వ్ అయ్యేలా అధిష్టానం నిర్ణయం తీసుకోవాలని తెలుగు తమ్ముళ్లు రిక్వెస్ట్ చేస్తున్నారు.
Also Read: డిఫెన్స్ నుంచి అటాక్ మోడ్..! జగన్ రివర్స్ అటాక్‌తో వైసీపీకి ఆ పేరు పోయేనా?
