Gossip Garage: టార్గెట్ జగన్ ఇలాఖా..! సీమలో మళ్లీ వైసీపీ కోలుకోకుండా కూటమి పార్టీల వ్యూహం

ఇప్పుడు కూటమిలో మరో మిత్రపక్షం వంతు అన్నట్లుగా ఉంది. బీజేపీ కూడా కడప నుంచే తన కార్యాచరణకు రెడీ అవుతోంది.

Gossip Garage: టార్గెట్ జగన్ ఇలాఖా..! సీమలో మళ్లీ వైసీపీ కోలుకోకుండా కూటమి పార్టీల వ్యూహం

Updated On : July 27, 2025 / 12:23 AM IST

Gossip Garage: అక్కడ ప్రత్యర్థి అడుగు పెట్టలేరన్నారు. అది శత్రుదుర్భేద్యమైన కంచుకోటగా చెప్పుకొచ్చారు. ఆ ప్రచారాన్ని పటాపంచెలు చేసి జగన్ ఇలాఖలో గ్రాండ్‌ విక్టరీ కొట్టింది కూటమి. వైసీపీ కంచుకోటగా చెప్పుకునే రాయలసీమలో 52 అసెంబ్లీ స్థానాలకు గాను ఏకంగా 45 సీట్లను కూటమి గెల్చుకుంది. కడపలో కూడా వైసీపీ పట్టు నిలుపుకోలేకపోయింది. దాంతో మొన్నటి ఎన్నికల తర్వాత కూటమి కాన్సంట్రేషన్ ఓవర్ టు సీమ అయిపోయింది.

వైసీపీని తిరిగి అక్కడ కోలుకోకుండా చేస్తే ఇంకో రెండు మూడు టర్మ్‌లు తమదే పవర్ అని అంచనా వేస్తోంది టీడీపీ. అందుకే అధికారంలోకి వచ్చిన తర్వాత మొదటి మహానాడుకు కడపనే వేదికగా ఎంచుకుంది సైకిల్ పార్టీ. జగన్ కంచుకోటలో మూడురోజుల పాటు మహానాడు నిర్వహించి..లక్షలాది మందితో సభ పెట్టి..జెండాలు, ఫ్లెక్సీలు, హోర్డింగ్‌లతో పసుపు మయం చేసి పబ్లిక్ అటెన్షన్ గ్రాబ్‌ చేసే ప్రయత్నం చేసింది.

తెలుగుదేశం పుట్టాక చాలా నగరాల్లో మహానాడు పెట్టారు. కానీ ఫస్ట్ టైమ్‌ హిస్టరీలో సాధించనన్ని సీట్లు సాధించిన తర్వాత కడపను టార్గెట్ చేస్తూ బ్రహ్మాండంగా పార్టీ పండుగను నిర్వహించి వైసీపీకి తన సత్తా ఏంటో చూపించింది టీడీపీ. సేమ్‌టైమ్‌ జనసేన పరంగా డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ కూడా వరుసగా కడప పర్యటనలు చేస్తూ..జగన్ అండ్ వైసీపీ నేతలకు వార్నింగ్‌లు ఇస్తూ వస్తున్నారు.

ఇప్పుడు కూటమిలో మరో మిత్రపక్షం వంతు అన్నట్లుగా ఉంది. బీజేపీ కూడా కడప నుంచే తన కార్యాచరణకు రెడీ అవుతోంది. బీజేపీకి కొత్త అధ్యక్షుడిగా నియమితులైన పీవీఎన్ మాధవ్ రాష్ట్ర పర్యటనలకు సిద్ధం అవుతున్నారు. వాటిని కడప నుంచే మొదలు పెడతామని ప్రకటించారు. కడపను రాజకీయ కోణంలో కాకుండా ఆధ్యాత్మిక కోణంలో చూస్తున్నాం.. అందుకే కడపను ఎంచుకుంటున్నామని చెబుతున్నారు.

Also Read: బీజేపీలో బీఆర్ఎస్ విలీనం చేస్తామనలేదా..? నన్ను గెలకొద్దు, చాలా నిజాలు చెప్పాల్సి వస్తుంది- కేటీఆర్ కు సీఎం రమేశ్ వార్నింగ్

దేవుని తొలి గడప కడప అని మాధవ్ చెప్పారు. అందుకే సారధ్యం పేరుతో రాష్ట్ర పర్యటన త్వరలోనే మొదలవుతుందని అంటున్నారు. తొలి శాసనం దొరికిన జిల్లాగా అలాగే తెలుగు జాతి తెలుగు సంస్కృతికి ప్రధాన ద్వారంగా నిలిచిన కడప నుంచి పర్యటన స్టార్ట్‌ చేస్తామంటున్నారు. ఐదు విడతలుగా సారధ్యం కార్యక్రమం రాష్ట్రవ్యాప్తంగా కొనసాగనుంది. ఉత్తరాంధ్రకు చెందిన మాధవ్..అక్కడి నుంచే పార్టీ యాక్టివిటీస్‌ను మొదలెడతారని అంతా అనుకున్నారు. కానీ మాధవ్ తన తొలి రాష్ట్ర పర్యటనను రాయలసీమ నుంచి పైగా జగన్‌కు, వైసీపీకి హార్డ్ కోర్ జిల్లా అయిన కడప నుంచి ప్రారంభిస్తుండటం ఆసక్తికరంగా మారింది.

కూటమి పార్టీలన్నీ తమ బలాన్ని పెంచుకోవడానికి కార్యక్షేత్రంగా కడపనే ఎంచుకుంటున్నాయి. పవన్ కూడా అనేక సార్లు రాయలసీమలో పర్యటిస్తూ వస్తున్నారు. కడపలో రచ్చబండ కార్యక్రమం పెట్టారు. ఆ మధ్యే కడప వెళ్ళి మరీ ఎంపీడీవో మీద జరిగిన దాడిని ఖండించి వచ్చారు పవన్. ఏకంగా రాయలసీమలోనే క్యాంప్‌ ఆఫీస్‌ పెడతానంటూ ప్రకటించేశారు. రాయలసీమ మీ జాగీరు కాదు..గూండాగిరి చేస్తే ఊరుకునేది లేదంటూ వార్నింగ్ ఇచ్చారు పవన్.

ఇక కర్నూలు జిల్లాలో గ్రీన్ కో ప్రాజెక్ట్ పనులను పరిశీలించారు. ఇక కడపలో పర్యటించి..సజ్జల రామకృష్ణారెడ్డి కుటుంబ సభ్యుల ఆధీనంలో ఉన్నాయని ఆరోపిస్తున్న అటవీ భూములను పరిశీలించారు. సీఎం చంద్రబాబు కూడా నెలలో కనీసం రెండు సార్లకు తక్కువ కాకుండా సీమ జిల్లాల టూర్లు వేస్తున్నారు. ఇప్పుడు బీజేపీ కూడా రాయలసీమపైనే ఫోకస్ పెడుతోంది. దాంతో వైసీపీ వర్సెస్ కూటమిగా రాయలసీమ రాజకీయం మారిపోయింది.

తిరిగి తన పట్టును సాధించేందుకు..గత వైభవం తెచ్చుకునేందుకు వైసీపీ ప్లాన్ చేస్తోంది. మూడు కీలక పార్టీలు అంతా కలసి సీమ మీద కన్ను వేయడంతో వైసీపీకి సవాల్‌గా మారింది. జగన్‌ కంచుకోట సెంట్రిక్‌గా కూటమి పార్టీలు చేస్తున్న ప్లాన్లు ఎంత వరకు సక్సెస్ అవుతాయో చూడాలి.