Gossip Garage : రేషన్ బియ్యం మాయం..! రైస్ మాఫియాలో పేర్నినానికి ఉన్న లింకులేంటి?

ఇప్పటివరకు క్లీన్ పేజీగా ఉన్న పేర్నినాని బాగోతాన్ని కూటమి ప్రభుత్వం బయటకు లాగేందుకు ప్రయత్నిస్తోంది.

Gossip Garage : రేషన్ బియ్యం మాయం..! రైస్ మాఫియాలో పేర్నినానికి ఉన్న లింకులేంటి?

Perni Nani

Updated On : December 13, 2024 / 2:12 AM IST

Gossip Garage : వైసీపీ కీలక నేతలపై కూటమి సర్కార్ ఫోకస్ పెట్టిందా..? ఒక్కొక్కరిని టార్గెట్ చేసి వాళ్ల నోళ్లకు తాళం వేస్తుందా..? పాత కేసుల ఫైళ్ల దుమ్ము దులుపుతుందా.. అసలు ఏపీ రాజకీయాల్లో ఏం జరుగుతోంది? బియ్యం మాఫియా డైరీలో పేర్నినాని దాచిన పేజీల్లోని పేచీలు ఏంటి?

వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు పేర్నినాని స్టైలే వేరు. ఆయన మైక్ పడితే మైకాసురుడు అయిపోయే వారు. ప్రత్యర్థులపై తన నోటి ధాటితో విరుచుకుపడే వారు. నాని పంచులు పొలిటికల్ సర్కిల్స్ లో మార్మోగిపోయేవి. కానీ, ఇప్పుడు ప్రభుత్వం మారింది. ఇప్పటివరకు క్లీన్ పేజీగా ఉన్న పేర్నినాని బాగోతాన్ని కూటమి ప్రభుత్వం బయటకు లాగేందుకు ప్రయత్నిస్తోంది. అందులో భాగంగా పేర్ని నాని భార్య పేర్ని జయసుధ పేరుతో మచిలీపట్నంలో నిర్వహిస్తున్న గోదాముల్లో రేషన్‌ బియ్యం మాయమైనట్లు అధికారులు నిగ్గుతేల్చారు.

పేర్నినాని భార్య పేరుపై ఉన్న గోడౌన్లలో పౌరసరఫరాల శాఖ పీడీఎస్ బియ్యాన్ని నిల్వ ఉంచింది. వీటిని అద్దె ప్రాతిపదికన వాడుకునేలా పౌరసరఫరాల సంస్థతో 2020లో ఒప్పందం చేసుకున్నారు. అప్పటి పౌరసరఫరాల శాఖ మంత్రి కొడాలి నాని సహకారంతో ఈ ఒప్పందం జరిగింది. అప్పటి నుంచి బఫర్ ఇన్వెస్టర్ గోదాములుగా పౌర సరఫరాల సంస్థ వీటిని వాడుకుంటోంది. ఈ గోదాముల్లో పేదలకు పంచాల్సిన రేషన్ బియ్యాన్ని 10వేల టన్నుల మేర నిల్వ చేస్తున్నారు. వీటి నిర్వహణను పేర్ని అనుచర వర్గమే చూస్తోంది. అయితే, ఇందులో నిల్వ ఉంచిన బియ్యం మాయమైంది. ఏమైందో ఎవరికీ తెలియలేదు. బియ్యం పోయాయని, కావాలంటే డబ్బు చెల్లిస్తామని పేర్నినాని భార్య అధికారులకు లేఖ రాశారు. దీంతో కావాలని ఆయనే మాయం చేశారన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.

గోదాములో 7,719 బస్తాలు ఉంచగా.. వాటిలో 3,708 మాయమైనట్లు అధికారులు గుర్తించారు. పౌరసరఫరాల సంస్థ ఎండీ ఆదేశాలతో జిల్లా అసిస్టెంట్‌ మేనేజర్‌ బందరు తాలుకా పోలీసుస్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. దీంతో గోదాము యజమాని పేర్ని జయసుధ, మేనేజర్‌ మానస్‌ తేజ్‌పై పోలీసులు కేసు నమోదు చేశారు. అద్దె గోదాము నుంచి రూ.90 లక్షల విలువైన రేషన్‌ బియ్యం మాయమయ్యాయని, దీనిపై సమగ్రంగా విచారణ చేయాలని కృష్ణా జిల్లా ఎస్పీకి పౌరసరఫరాల సంస్థ జిల్లా మేనేజర్‌ లేఖ రాశారు.

Also Read : వైసీపీకి వరుస షాకుల వెనుక రీజన్‌ ఏంటి? ఉన్నట్టుండి ఆ పార్టీ నేతలు ఎందుకు గుడ్‌బై చెబుతున్నారు?