Pawan Kalyan: ఓవైపు రివ్యూలు..ఇంకోవైపు ఫీల్డ్ విజిట్లు.. వైసీపీ విమర్శలకు పవన్ చెక్ చెప్పినట్లేనా?
డిప్యూటీ సీఎం క్షేత్రస్థాయి పర్యటనలో ఎక్కువ సేపు గడపటం, నీళ్లు, బురదను లెక్క చేయకుండా పొలాల్లో తిరగడం ఆసక్తికర చర్చకు దారి తీసింది.
Pawan Kalyan: ప్రతిపక్షంలో ఉంటేనే విమర్శిస్తారు. ఫీల్డ్ విజిట్‌లు అంటూ హడావుడి చేస్తారు. అధికారంలోకి వచ్చేసరికి ఇవేమి ఉండవా? జనం బాధలు పవన్‌కు పట్టవా? అంటూ వైసీపీ పలుసార్లు పవన్‌ను అటాక్ చేసి తీరు ఇది. కానీ మొంథా తుపాన్ సందర్భంగా సేనాని ఫీల్డ్ విజిట్లు చేశారు. రైతులను పరామర్శించారు. అలాగే ఆలయాల సందర్శన చేసి వార్తల్లో నిలిచారు. పవన్‌ది ఎప్పుడూ జనం బాటేనా? గ్రౌండ్ లెవల్ పర్యటనలతో చెప్పాలనుకున్నదేంటి?
పవన్ కల్యాణ్..ఏపీ డిప్యూటీ సీఎం. అంటే సీఎం తర్వాత అంతటి పోస్ట్‌గా చెబుతుంటారు. పైగా కూటమిలో కీరోల్. అందుకు తగ్గట్లుగానే సీఎం చంద్రబాబు, మంత్రి లోకేశ్ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్‌కు ప్రయారిటీ ఇస్తున్నారు. పవన్ కూడా తన శాఖల వ్యవహారాలను చూసుకుంటూనే..పరిపాలనలో కీలక పాత్ర పోషిస్తున్నారు. మొంథా తుఫాన్ విపత్తు సమయంలో ఫీల్డ్ విజిట్లు చేసి జనం దృష్టిని ఆకర్షించారు.
ఓవైపు సీఎం చంద్రబాబు, మరోవైపు పవన్ గ్రౌండ్ లెవల్‌లో పర్యటించి జరిగిన నష్టంపై ఆరా తీశారు. అయితే పవన్ ప్రతిపక్షంలో ఉన్నప్పుడు జనం సమస్యలు అంటూ గళమెత్తి..అపోజిషన్‌లోకి వచ్చేసరికి మౌనంగా ఉండిపోతున్నారని పలుసార్లు వైసీపీ విమర్శిస్తూ ఉంటోంది. అయితే తనదెప్పుడూ జనం బాటే అని ప్రూవ్ చేస్తున్నారు పవన్. కూటమి ప్రభుత్వంలోని లోటుపాట్లపై కూడా అప్పుడప్పుడు తన వాయిస్ వినిపిస్తున్నారు.
కూటమి ప్రభుత్వంలో సమస్యలు కనిపించడం లేదా అంటూ విమర్శలు..
పవన్ వెండి తెరమీద పవర్ స్టార్. తమ అభిమాన నటుడిని నేరుగా చూడాలని..ఆయన మాట వినాలని కోరుకునే ఫ్యాన్స్ కోకొల్లలు. ఈ క్రమంలోనే పవన్ క్షేత్రస్థాయి పర్యటనలు పెట్టుకోవడానికి ఇష్టపడరు. ఫీల్డ్‌కు వెళ్తే జనం గుమిగూడటం..అధికారుల హడావుడి..అంతా సినిమా స్టార్ వచ్చినట్లుగానే హంగామా ఉంటుందని గతంలో పలు గ్రౌండ్ లెవల్ విజిట్లను క్యాన్సిల్ చేసుకున్నారు.
తాను జిల్లాల పర్యటనకు వెళ్తే..సెల్ఫీలు, ఫ్యాన్స్ స్లోగన్స్‌తో ఇష్యూ సైడ్ ట్రాక్ పడుతుందని..అధికారులతో మాట్లాడి సమస్యలపై ఆరా తీసేవారు. దీంతో అటు వైసీపీకి టార్గెట్ అయిపోయారు పవన్. జనసేనాని అని చెప్పుకునే పవన్‌కు కూటమి ప్రభుత్వంలో సమస్యలు కనిపించడం లేదా అంటూ ఫ్యాన్ పార్టీ లీడర్లు విమర్శలు చేస్తున్నారు. దీంతో అటు ఫ్యాన్స్ హంగామాకు..ఇటు వైసీపీ విమర్శలకు చెక్ పెడుతూ..గ్రౌండ్ లెవల్‌లో పర్యటించారు పవన్.
రాజకీయ తెరపై జనసేనానిగా పవన్ పవర్ ఫుల్ లీడర్. ఉప ముఖ్యమంత్రిగా అధికార బాధ్యతలు మోస్తూనే ఆయన జనాలతో మమేకం అవుతున్నారు. ఇలా ఆయన సినీ జీవితం ప్రజా జీవితం రెండింటినీ జాగ్రత్తగా బాలెన్స్ చేసుకుంటూ వెళ్తుంటారు. మొంథా తుఫాన్ బాధితులను పరామర్శించేందుకు పర్యటన పెట్టుకున్నారు. అవనిగడ్డ నియోజకవర్గం పరిధిలో మొంథా తుపాను ప్రభావిత ప్రాంతాలను పరిశీలించారు. తనను కలిసిన ప్రతి ఒక్కరి సమస్యను తెలుసుకున్న పవన్..రైతులతో నేరుగా మాట్లాడి అండగా ఉంటామని భరోసా ఇచ్చారు. పొలంలోకి దిగి పంట దెబ్బతిన్న పరిస్థితులను గమనించారు. ఈ పర్యటన మొత్తం రైతుల సాధక బాధలు వినడంతోనే సాగింది.
డిప్యూటీ సీఎం క్షేత్రస్థాయి పర్యటనలో ఎక్కువ సేపు గడపటం, నీళ్లు, బురదను లెక్క చేయకుండా పొలాల్లో తిరగడం ఆసక్తికర చర్చకు దారి తీసింది. పవన్ పర్యటన అంటే లేనిపోని హడావుడి ఉంటుందని విమర్శిస్తూ ఉంటుంది వైసీపీ. ఇప్పుడు పవన్ ఫీల్డ్ విజిట్‌పై కూడా ట్రోల్స్ చేస్తున్నారు. కానీ సేనాని పర్యటనలో ఎక్కడా హంగామా కనిపించలేదని అంటున్నారు. తమ సమస్యలను తెలుసుకోడానికి పవన్ చూపిన చొరవ రైతులను ఆకట్టుకుందని అంటున్నారు. ఇక తిరుగు ప్రయాణంలో ఆధ్యాత్మిక పర్యటన..ఆ తర్వాత రోడ్డు పక్కన కూరగాయలు, కొబ్బరి బొండాల వ్యాపారం చేసుకునే వ్యాపారులను పవన్ పలకరించారు.
ఎంత సినీ స్టార్ అయినా..పూర్తిగా పొలిటికల్ లీడర్‌గా..బాధ్యతాయుతమైన డిప్యూటీ సీఎం పోస్ట్‌లో పవన్ చూపించిన చొరవ..రైతులను ఎంతగానో ఆకట్టుకుందట. పవన్ గ్రౌండ్ లెవల్ టూర్‌పై జనసేన క్యాడర్ కూడా హ్యాపీగా ఉందట. వైసీపీ విమర్శలకు చెక్ పెట్టేలా తమ అధినేత రైతులను పరామర్శించడం..ప్రభుత్వ దృష్టికి సమస్యలను తీసుకెళ్లడంపై హ్యాపీగా ఫీల్ అవుతున్నారట. మొత్తం మీద పవన్ ఫీల్డ్ విజిట్లు..వైసీపీ విమర్శలకు చెక్ పెట్టినట్లు అయిందన్న టాక్ అయితే వినిపిస్తోంది.
Also Read: పొత్తులపై కూటమి పార్టీలు ఫిక్స్.. మరి వైసీపీ ప్లానేంటి? జగన్ స్ట్రాటజీ ఎలా ఉండబోతోంది?
