Gottipati Ravi Kumar: తుగ్లక్ చర్యల్లో వైఎస్‌ జగన్ మరో మైలురాయిని దాటారు: గొట్టిపాటి రవికుమార్

జగన్ చేసిన పాపాలే ప్రజలకు శాపాలుగా మారాయని చెప్పారు.

Gottipati Ravi Kumar: తుగ్లక్ చర్యల్లో వైఎస్‌ జగన్ మరో మైలురాయిని దాటారు: గొట్టిపాటి రవికుమార్

Gottipati Ravi Kumar

Updated On : December 26, 2024 / 11:07 AM IST

తుగ్లక్ చర్యల్లో మాజీ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్ మరో మైలురాయిని దాటారని ఆంధ్రప్రదేశ్ విద్యుత్ శాఖ మంత్రి గొట్టిపాటి రవికుమార్ అన్నారు. ఇవాళ అమరావతిలో గొట్టిపాటి రవికుమార్ మీడియాతో మాట్లాడుతూ.. జగన్ తాను పెంచిన విద్యుత్ చార్జీలపై తానే ధర్నాకు పిలుపునిచ్చారని ఎద్దేవా చేశారు.

ట్రూ అప్ చార్జీల భారం ఉంటే అది కచ్చితంగా జగన్ మోహన్ రెడ్డి వల్లేనని గొట్టిపాలి రవికుమార్ తెలిపారు. సీఎంగా జగన్ చేసిన పాపాలే ప్రజలకు శాపాలుగా మారాయని చెప్పారు. పీపీఏల రద్దు, సోలార్, విండ్ పెట్టుబడిదారులను బెదిరించి విద్యుత్ లోటుకు కారణం అయ్యారని తెలిపారు.

వైఎస్‌ జగన్ హయాంలోనే ఏపీ జెన్కో సర్వనాశనం అయ్యిందని గొట్టిపాలి రవికుమార్ చెప్పారు. రెండేళ్ల క్రితమే విద్యుత్ చార్జీలు పెంచాలని జగన్ ఈఆర్సీని కోరారని తెలిపారు. నేడు ప్రజలను తప్పుదోవ పట్టించేలా కూటమి ప్రభుత్వం పై ఆరోపణలు చేస్తున్నారని అన్నారు. జగన్ హయాంలోనే వసూళ్లకు డిస్కంలు అనుమతి కోరాయని తెలిపారు.

Erolla Srinivas: బీఆర్‌ఎస్‌ నేత ఎర్రోళ్ల శ్రీనివాస్‌ అరెస్ట్‌.. మండిపడ్డ హరీశ్ రావు