ఏపీలో గవర్నర్ కోటా ఎమ్మెల్సీ అభ్యర్థుల ఖరారు.. ఎస్సీ, మైనారిటీ సామాజిక వర్గాలకు సీఎం జగన్ అవకాశం

ఏపీలో గవర్నర్ కోటాలో ఎమ్మెల్సీ అభ్యర్థులను ప్రభుత్వం ఖరారు చేసింది. గవర్నర్ నామినేట్ చేసే స్థానాల్లో రెండు స్థానాలు ఖాళీగా ఉన్నాయి. ఈ రెండు స్థానాలకు అభ్యర్థులకు ఖరారు చేసింది. పశ్చిమగోదావరి జిల్లా ఎస్సీ వర్గానికి చెందిన కొయ్యే మోషేను రాజు, కడప జిల్లా రాయచోటికి చెందిన మైనా జకియా పేర్లను ప్రభుత్వం ఎంపిక చేసింది. అభ్యర్థుల పేర్లను ఏపీ ప్రభుత్వం రేపు గవర్నర్ కు పంపనుంది. రెండు స్థానాలు కూడా గవర్నర్ కోటా ఎమ్మెల్సీలు కావడంతో గవర్నర్ వీరిని నియమించాల్సిన అవసరం ఉంటుంది.
ఏపీలో ఖాళీ అయిన రెండు ఎమ్మెల్సీ స్థానాలకు సంబంధించిన పేర్లను ప్రభుత్వం రేపు గవర్నర్ కు పంపించనుంది. అయితే ఇప్పటికే ప్రభుత్వం తరపున ఇద్దరిని ఖరారు చేసినట్లుగా సమాచారం. ఒకటి ఎస్సీ సామాజిక వర్గానికి, రెండోది మైనారిటీ సామాజిక వర్గానికి సీఎం జగన్ అవకాశం ఇచ్చినట్లుగా తెలుస్తోంది. ముఖ్యంగా పశ్చిమగోదావరి జిల్లా ఎస్సీ సామాజిక వర్గానికి చెందిన కొయ్యే మోషేనురాజు, అదేవిధంగా కడప జిల్లా రాయచోటి నియోజకవర్గానికి చెందిన జకియా కానమ్ పేర్లను ఫైనల్ చేస్తూ సీఎం జగన్ నిర్ణయం తీసుకున్నట్లుగా సమాచారం అందుతోంది.
వీరిద్దరి పేర్లను ప్రభుత్వం రేపు గవర్నర్ కు పంపించబోతుంది. పేర్లను గవర్నర్ కు పంపించిన తర్వాత వీరిద్దరిని ఎమ్మెల్సీలుగా గవర్నర్ నోటిఫై చేయనున్నారు. ముఖ్యంగా రెండు సామాజికవర్గాలకు ప్రాధాన్యతనిస్తూ సీఎం జగన్ నిర్ణయం తీసుకున్నారు. అయితే మిగిలిన స్థానాలకు సంబంధించి కూడా పెద్ద ఎత్తున పోటీ ఉన్న నేపథ్యంలో వాటి భర్తీకి సంబంధించి కూడా సీఎం జగన్ కొన్ని పేర్లు పరిశీలన చేస్తున్నారు.
https://youtu.be/TyXUgr8AiB8