కాబోయే ఎన్నికల కమిషనర్ ఎవరు? గవర్నర్‌కు ముగ్గురి పేర్లు పంపిన ప్రభుత్వం
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం కొత్తగా రాబోయే ఎన్నికల కమిషన్ నియామకానికి సంబంధించి ముగ్గురు పేర్లను ఖరారు చేసింది. ఇందులో భాగంగా ముగ్గురు రిటైర్డ్ అధికారులతో కూడిన జాబితాను గవర్నర్‌కు పంపింది.

Ap Govt
SEC:ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం కొత్తగా రాబోయే ఎన్నికల కమిషన్ నియామకానికి సంబంధించి ముగ్గురు పేర్లను ఖరారు చేసింది. ఇందులో భాగంగా ముగ్గురు రిటైర్డ్ అధికారులతో కూడిన జాబితాను గవర్నర్‌కు పంపింది. మాజీ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నీలం సాహ్నీ, ప్రేమచంద్రా రెడ్డి, శామ్యూల్ పేర్లను గవర్నర్‌కు ప్రతిపాదించింది. ముగ్గురు రిటైర్ట్ ఐఏఎస్ అధికారులతో కూడిన ప్యానల్‌ను రాష్ట్ర ప్రభుత్వం గవర్నర్ కార్యాలయానికి పంపించింది.
ప్రస్తుత ఎన్నికల కమిషనర్ నిమ్మగడ్డ పదవీ కాలం మార్చి 31వ తేదీతో ముగియనుంది. ఈ క్రమంలో రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిగా పనిచేసి, ముఖ్యమంత్రి ముఖ్య సలహాదారుగా ఉన్న నీలంసాహ్ని, మరో రిటైర్డ్ ఐఏఎస్ అధికారి, నవరత్నాల పర్యవేక్షణ సలహాదారు ఎం.శామ్యూల్, ఇంకో రిటైర్డ్ ఐఏఎస్, ప్రస్తుతం రాష్ట్ర పునర్విభజన విభాగం బాధ్యతలు నిర్వహిస్తున్న ఎల్.ప్రేమచంద్రారెడ్డి పేర్లతో కూడిన ప్యానల్‌ను రాష్ట్ర ప్రభుత్వం గవర్నర్ విశ్వభూషణ్‌కు పంపింది.
సీనియారిటీ, సమర్ధత ఆధారంగా గవర్నర్ ఎస్ఈసీని నియమిస్తారు. ప్రభుత్వ ఇంట్రస్ట్‌ను పరిగణలోకి తీసుకుని, మార్చి 31వ తేదీలోగా కొత్త ఎస్ఈసీని ప్రభుత్వం ప్రకటించబోతుంది. ఈ ముగ్గరిలో గవర్నర్ ఎవరి పేరును ఆమోదిస్తే.. వారిని రాష్ట్ర ఎన్నికల కమిషనర్‌గా ప్రభుత్వం నియమిస్తుంది. ఈ నియామకం జరిగితే వీలైనంత త్వరగా ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికల ప్రక్రియ పూర్తి చేయించి కోవిడ్ వ్యాక్సినేషన్‌పై దృష్టి సారించాలని రాష్ట్ర ప్రభుత్వం భావిస్తోంది.