ఏపీలో టీడీపీ రెడ్ బుక్ రాజ్యాంగం నడుస్తోంది: మాజీ మంత్రి గుడివాడ అమరనాథ్

ఆంధ్రప్రదేశ్ లో అంబేద్కర్ రాజ్యాంగం పోయి టీడీపీ రెడ్ బుక్ రాజ్యాంగం నడుస్తోందని మాజీ మంత్రి గుడివాడ అమరనాథ్ విమర్శించారు.

ఏపీలో టీడీపీ రెడ్ బుక్ రాజ్యాంగం నడుస్తోంది: మాజీ మంత్రి గుడివాడ అమరనాథ్

gudivada amarnath respond on ysrcp party office demolition

Gudivada Amarnath: ఎన్నికాల ఫలితాల వచ్చిన దగ్గర నుంచి ఏపీలో టీడీపీ దమనకాండ సృష్టిస్తోందని, గడిచిన 20 రోజులుగా ప్రభుత్వ ప్రైవేటు ఆస్తులపై దాడులు జరుగుతున్నాయని మాజీ మంత్రి గుడివాడ అమరనాథ్ అన్నారు. విశాఖపట్నంలో శనివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. ఈరోజు తెల్లవారుజామున తాడేపల్లిలో వైసీపీ కార్యలయం నిర్మాణాన్ని కూల్చివేశారని, కోర్టులో ప్రోసిడింగ్ జరుతుండగానే ఎలా కూల్చివేస్తారని ప్రశ్నించారు. రాష్ట్రంలో అంబేద్కర్ రాజ్యాంగం పోయి టీడీపీ రెడ్ బుక్ రాజ్యాంగం నడుస్తోందని విమర్శించారు.

”కొత్తగా ఏర్పడిన కూటమి ప్రభుత్వానికి 6 నెలలు పాటు సమయం ఇవ్వాలని జగన్ మెహన్ రెడ్డి చెప్పారు. అప్పటివరకు కూడా ఆగేట్టు వాళ్లు లేరు. వాగు పోరంపోకు భూమిలో మంగళగిరిలో టీడీపీ కేంద్ర కార్యాలయం ఉంది. టీడీపీ ఆఫీసుల కోసం వివిధ జిల్లాలో 2015 నుంచి 19 వరకు అనేక భూముల కేటాయింపులు చేసుకున్నారు. వాళ్లే 2016లో వివిధ రాజకీయ పార్టీలు కోసం స్థలాలు కేటాయింపునకు జీవో రిలీజ్ చేశారు. దానిని బేస్ చేసుకుని 2019 నుండి 24 వరకు స్థలాలు కేటాయించాం.

Also Read: ఏపీ అసెంబ్లీలో ఆసక్తికర సన్నివేశం.. సభలో నవ్వులు పూయించిన పవన్ కల్యాణ్..

ఎండాడలో 2 ఎకరాలు వైసీపీ కార్యాలయం కోసం 33 ఏళ్ల లీజుకు కేటాయింపు చేశాం. 2023 పిబ్రవరిలో వుడాకి ప్లాన్ అప్లేయ్ చేశాం. దీని కోసం 15 లక్షల 65 వేల రూపాయలు కట్టాం. అనకాపల్లి కార్యాలయ నిర్మాణానికి 30 లక్షలకు పైగా కట్టాము. అనుమతులు లేకుండా నిర్మాణం చేసామని అవాస్తవాలు చెబుతున్నారు. ఇప్పుడు వుడా కాదు జీవీఎంసీ ప్లాన్ అప్లయ్ చేయాలంటూ నోటీసులు ఇచ్చారు. గజాల్లో ఉంటే జీవీఎంసీ నుంచి ప్లాన్ తీసుకోవాలి కాని, ఎకరాల్లో ఉంటే వుడా నుండి ప్లాన్ తీసుకోని జీవీఎంసీకి ప్లాన్ అప్లేయ్ చేయ్యాలి.. మేము అదే చేశాం. మీకు సొంత రాజ్యాంగం ఉందని ఇలా చేయడం దారుణం. అవకాశాలు అనేవి అందరికీ వస్తాయి.

Also Read: అధికారం ఎవరికీ శాశ్వతం కాదు.. గుర్తుంచుకోండి : అంబటి రాంబాబు హెచ్చరిక

వైసీపీ కార్యాలయాలు మాకు దేవాలయాలతో సమానం. ప్రభుత్వ కక్ష సాధింపు ధోరణిపై చట్టపరంగా పోరాటం చేస్తాం. అన్ని అనుమతులతో నిర్మాణాలు చేపట్టాం. అన్ని ఆధారాలు, డాక్యుమెంట్స్ మా వద్ద ఉన్నాయి. గతంలో మేము కూల్చివేశాం కాబట్టే ఇక్కడ కూర్చున్నామ”ని గుడివాడ అమరనాథ్ అన్నారు.