గుడివాడ అమర్‌నాథ్‌ దారెటు? మౌనం వెనుక కారణం అదేనా?

అందుకే పార్టీకీ, పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉంటూ సైలెంటైపోయారని టాక్ వినిపిస్తోంది.

గుడివాడ అమర్‌నాథ్‌ దారెటు? మౌనం వెనుక కారణం అదేనా?

gudivada amarnath

Updated On : June 21, 2025 / 8:35 PM IST

వైసీపీలో మాజీ మంత్రి గుడివాడ అమర్‌నాథ్‌ వ్యవహారం హాట్ టాపిక్‌గా మారింది. వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు విపక్షాలపై ఒంటికాలు మీద లేచే గుడివాడ అమర్ నాథ్, ఇప్పుడు నోటికి అచితూచి పని చెబుతున్నారట. అసలు మీడియా ముందుకు రావడానికి కూడా ఇష్టపడట్లేదట. వైసీపీ ఘోర పరాజయం తర్వాత పార్టీ తరఫున మీడియా ముందుకు వచ్చి వాయిస్ వినిపించే అతి కొద్దిమంది నేతల్లో గుడివాడ ఒకరిగా ఉంటూ వచ్చారు.

ఉమ్మడి విశాఖ జిల్లా రాజకీయాలు, సమస్యలు, రాష్ట్రస్థాయి అంశాలపై కూడా గుడివాడ అమర్ విశాఖ నుంచే గళం వినిపించేవారు. అయితే కొద్ది రోజులుగా ఆయన పూర్తిగా సైలెంట్ అయ్యారు. అసలు పార్టీలో ఉన్నారా.? లేరా అన్నట్లుగా మారిపోయింది ఆయన తీరు. పార్టీతో అంటీముట్టనట్టుగా వ్యవహరిస్తున్న గుడివాడ తీరును చూసి ఆయన వెంట తిరిగే కొద్దిమంది నేతలే ఆశ్చర్యపోతున్నారట. సొంత పార్టీ నేతలే ఆయన సినిమా అయిపోయిందని చర్చించుకుంటున్నారట.

Also Read: ఫోన్‌ ట్యాపింగ్‌ కేసులో ఆ మాజీ డీజీపీ ఇరుక్కున్నట్లేనా? కేసు కొత్త టర్న్ తీసుకోబోతోందా? కథ అడ్డం తిరిగిందా?

పార్టీ అధినేత జగన్‌మోహన్‌రెడ్డికి అత్యంత ఆప్తుడుగా చెప్పుకునే గుడివాడ అమర్నాథ్ ఇప్పుడు పార్టీకి టచ్‌ మీ నాట్‌ అన్నట్లుగా ఉండటానికి కారణాలేంటనే దానిపై రాజకీయవర్గాలలో పెద్దఎత్తున చర్చ జరుగుతోంది. దీని వెనుక అత్యంత బలమైన కారణాలే ఉన్నాయట. రెండున్నరేళ్ల పాటు మంత్రి పదవి అనుభవించిన గుడివాడ అమర్‌నాథ్ పార్టీ అధినేత జగన్ తీరుపై తీవ్ర అసంతృప్తితో ఉన్నారని ఆయన వర్గీయులే చెబుతున్నారు.

తాను కోరుకున్న నియోజకవర్గానికి తనను ఇంచార్జ్‌గా నియమించలేదన్న అసంతృప్తి ఆయనలో బాగా పెరిగిపోయిందంటున్నారు. అందుకే అధినేత జగన్‌పై గుడివాడ అమర్ తీవ్ర అసహనంతో ఉన్నారని విశాఖ వైసీపీలో చర్చ జరుగుతోంది. అందుకే పార్టీ ఆఫీస్‌ ముఖం కూడా చూడటం లేదట గుడివాడ అమర్. ఇందుకు కారణం ఆయన కోరుకున్న విశాఖ నగర నియోజకవర్గ ఇంచార్జ్‌ పదవి దక్కకపోవడమేనని పార్టీ వర్గాలు చెబుతున్నాయి.

Also Read: స్మార్ట్‌ వాచ్‌ల నుంచి స్మార్ట్‌ రింగ్స్‌కి.. అప్‌గ్రేడ్ అవుతున్న జనాలు.. రాజకీయ నాయకులు, సెలబ్రిటీలూ ఇవే వాడుతున్నారు.. ఎందుకంటే?

గత ఎన్నికల్లో గుడివాడ అమర్నాథ్ గాజువాక నియోజకవర్గం నుంచి వైసీపీ అభ్యర్థిగా పోటీ చేసి ఓడిపోయారు. రాష్ట్రంలోనే అత్యధిక మెజారిటీతో గాజువాక నుంచి టీడీపీ అభ్యర్థి పల్లా శ్రీనివాస్ గుడివాడ అమర్‌పై విజయం సాధించారు. దీంతో ఆయన ఏకంగా టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడయ్యారు. ఎన్నికల ఫలితాలు వచ్చిన వెంటనే గుడివాడ అమర్ విశాఖలో వాలిపోయారు. విశాఖ నగర పరిధిలో ఏదో ఒక నియోజకవర్గాన్ని తనకు అప్పగిస్తారని ఎన్నో ఆశలు పెట్టుకున్నారు.

గుడివాడకు ఆ నియోజకవర్గ బాధ్యతలు
కానీ జగన్ మాత్రం గుడివాడకు విశాఖ నగరం, రూరల్ కూడా కాకుండా చోడవరం నియోజకవర్గ బాధ్యతలు అప్పగించారు. దీంతో గుడివాడ తీవ్ర అసంతృప్తికి గురయ్యారట. అక్కడితో ఆగకుండా విశాఖ జిల్లా పార్టీ అధ్యక్ష బాధ్యతల నుంచి కూడా గుడివాడను పీకేశారు జగన్. ఇది తనకు పొమ్మనలేక పొగపెట్టినట్లేనని భావిస్తున్నారట అమర్‌. 2019 ఎన్నికల్లో అనకాపల్లి నుంచి పోటీ చేసి గెలిచి మంత్రిగా ఉన్న ఆయనను ఆ నియోజకవర్గ నుంచి తప్పించి చివరి నిమిషంలో గాజువాక టికెట్ ఇవ్వడమే అవమానంగా ఫీల్‌ అవుతుంటే..ఎన్నికల తర్వాత గాజువాక ఇంచార్జ్ గానైనా కొనసాగించకుండా, జిల్లా పార్టీ అధ్యక్ష బాధ్యతలు కూడా లేకుండా చేయడంతో..తీవ్ర నిరాశలో ఉన్నారట గుడివాడ.

అందుకే పార్టీకీ, పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉంటూ సైలెంటైపోయారని టాక్ వినిపిస్తోంది. మంత్రిగా ఉన్నప్పుడు సీనియర్లను కూడా లెక్కచేయకపోవడం, తనంతటి వాడే పార్టీలో లేడు అన్నట్లుగా బిహేవ్‌ చేయడంతోనే..గుడివాడకు గ్రౌండ్ పాలిటిక్స్ తెలుసొచ్చేలా చేయడానికే పార్టీ స్కెచ్ వేసిందని అంటున్నారు. అసంతృప్తిలో ఉన్నప్పటికీ మళ్లీ పాత రోజులు వస్తాయని గంపెడు ఆశలతో ఎదురు చేస్తున్నారట గుడివాడ. ఆయన ఆశలు నెరవేరుతాయో లేదో చూడాలి మరి.