Guntur Stampede : ఒక్కొక్కరికి రూ.30 లక్షలు.. గుంటూరు తొక్కిసలాట ఘటనలో మృతుల కుటుంబాలకు పరిహారం
గుంటూరు వికాస్ నగర్ లో తొక్కిసలాట ఘటనకు నైతిక బాధ్యత వహిస్తూ మృతుల కుటుంబాలకు ఉయ్యూరు ఫౌండేషన్ పరిహారం ప్రకటించింది. మృతుల కుటుంబాలకు ఒక్కొక్కరికి రూ.20 లక్షలు అందిస్తామని తెలిపింది.

Guntur Stampede : గుంటూరు వికాస్ నగర్ లో తొక్కిసలాట ఘటనకు నైతిక బాధ్యత వహిస్తూ మృతుల కుటుంబాలకు ఉయ్యూరు ఫౌండేషన్ పరిహారం ప్రకటించింది. మృతుల కుటుంబాలకు ఒక్కొక్కరికి రూ.20 లక్షలు అందిస్తామని తెలిపింది. టీడీపీ తరపున రూ.5లక్షలు అందిస్తామని చంద్రబాబు ప్రకటించారు.
ఇక గుంటూరు పశ్చిమ నియోజకవర్గ టీడీపీ ఇంచార్జి కోవెలమూడి రవీంద్ర మృతుల కుటుంబాలకు చెరో రూ.2లక్షల పరిహారం ప్రకటించారు. గాయపడ్డ వారికి లక్ష రూపాయల పరిహారం ఇస్తామన్నారు. డేగల ప్రభాకర్ రూ.లక్ష చొప్పున పరిహారం ప్రకటించారు.
Also Read..Stampede At Chandrababu Meeting : చంద్రబాబు సభలో తొక్కిసలాటకు కారణం అదేనా?
మరోవైపు ప్రభుత్వం సైతం పరిహారం ప్రకటించింది. మృతుల కుటుంబాలకు రూ.2లక్షల చొప్పున, గాయపడ్డ వారికి రూ.50వేల చొప్పున పరిహారం ఇస్తామంది.
చంద్రబాబు సభలో మరోసారి తొక్కిసలాట జరిగింది. ఈసారి గుంటూరు వికాస్ నగర్ లో చంద్రన్న కానుక పంపిణీ కార్యక్రమంలో తొక్కిసలాట జరిగింది. ఈ ఘటనలో ముగ్గురు మహిళలు మృతి చెందారు. కొందరు గాయపడ్డారు. వారంతా గుంటూరు జీజీహెచ్ లో చికిత్స పొందుతున్నారు.
గుంటూరు వికాస్ నగర్ లో టీడీపీ సభలో చంద్రబాబు పాల్గొని మాట్లాడారు. ఆయన అక్కడి నుంచి వెళ్లిపోయిన తర్వాత చంద్రన్న కానుక పంపిణీ ప్రారంభించారు. కానుకలు తీసుకునేందుకు మహిళలు భారీగా తరలివచ్చారు. దాంతో ఒక్కసారిగా తొక్కిసలాట జరగడంతో ముగ్గురు మృతి చెందారు. ఓ మహిళ స్పాట్ లోనే మరణించగా, మరో ఇద్దరు చికిత్స పొందుతూ మృతి చెందారు.
Also Read..Kandukur Accident: చంద్రబాబు సభలో తోపులాట.. ఏడుగురి మృతి.. మరో ఏడుగురికి తీవ్రగాయాలు
సభ వద్ద మరణించిన మహిళను ఏటీ అగ్రహారానికి చెందిన గోపిశెట్టి రమాదేవిగా గుర్తించారు. ఆసుపత్రిలో చికిత్స పొందుతూ రాజ్యలక్ష్మి, సయ్యద్ ఆసిమా ప్రాణాలు విడిచారు.
గుంటూరు వికాస్ నగర్ లో ఉయ్యూరు చారిటబుల్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఎన్టీఆర్ జనతా వస్త్రాలు, చంద్రన్న సంక్రాంతి కానుక పంపిణీ చేశారు. చంద్రబాబు ప్రసంగం కొనసాగినంత సేపు సజావుగానే ఉన్న సభ, ఆయన వెళ్లిపోయిన తర్వాత అదుపుతప్పింది. కార్యక్రమ నిర్వాహకులు, టీడీపీ నేతలు పరిస్థితిని కంట్రలో చేయలేకపోయారు. కానుకల కోసం మహిళలు ఎగబడ్డారు. దీంతో ఘోరం జరిగిపోయింది.
10TV LIVE : నాన్ స్టాప్ న్యూస్ అప్‌డేట్స్ కోసం 10TV చూడండి.
నాలుగు రోజుల్లోనే రెండో దుర్ఘటన. మొన్న కందుకూరులో చంద్రబాబు సభలో తొక్కిసలాట ఘటన మరువక ముందే మరో విషాదం నెలకొంది. ఆదివారం గుంటూరులోని వికాస్ నగర్ లో చంద్రబాబు సభలో మరోసారి తొక్కిసలాట జరిగింది. ఈ దుర్ఘటనలో ముగ్గురు మహిళలు మృతి చెందారు. చీరలు, తోఫా పంపిణీ కార్యక్రమంలో ఈ దుర్ఘటన జరిగింది.
చీరల కోసం మహిళలు ఒక్కసారిగా ఎగబడ్డారు. బ్యారికేడ్లు లేకపోవడంతో ఒకరిపై ఒకరు పడిపోయారు. దీంతో ఊపిరాడక పలువురు అస్వస్థతకు గురయ్యారు. ఇక తీవ్రంగా గాయపడ్డ నలుగురిలో ముగ్గురు మృతి చెందారు. స్పాట్ లోనే ఒకరు ప్రాణాలు కోల్పోగా.. ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మరో ఇద్దరు మహిళలు మృతి చెందారు.