హోదా ముగిసిన అధ్యాయం : జీవీఎల్

  • Published By: madhu ,Published On : February 5, 2020 / 10:36 AM IST
హోదా ముగిసిన అధ్యాయం : జీవీఎల్

Updated On : February 5, 2020 / 10:36 AM IST

ప్రత్యే హోదా ముగిసిన అధ్యాయమని సీఎం జగన్‌కు తెలుసన్నారు బీజేపీ ఎంపీ జీవీఎల్. దేశ ఆర్థిక వ్యవస్థను హోదా అంశం ప్రభావితం చేస్తుందన్నారు. ప్రత్యేక హోదా పునరుద్ధరించే ఆలోచన కేంద్రానికి లేదని కుండబద్దలు కొట్టారు. లోటు భర్తీ చేయాలనే ప్రత్యేక ప్యాకేజీ ఇచ్చిందనే విషయాన్ని గుర్తు చేశారు. ఏపీ రాష్ట్రానికి ప్రత్యేక హోదా కింద రూ. 22 వేల కోట్ల నిధులు కేటాయించిందన్నారు. ఏ రాష్ట్రానికి ఇవ్వనన్ని నిధులు ఏపీకి కేంద్రం ఇచ్చిందని తెలిపారు. హోదా విషయంలో ఏపీ సీఎం జగన్..ప్రధాన మంత్రి నరేంద్ర మోడీకి లేఖ రాసిన సందర్భంగా ఆయన పై వ్యాఖ్యలు చేశారు. విభజన సమయంలో పార్లమెంట్ సాక్షిగా, ఐదేళ్ల పాటు ఏపీకి ప్రత్యేక హోదా ఇస్తామని హామీ ఇచ్చారన్న విషయాన్ని లేఖలో ప్రస్తావించారు సీఎం జగన్. 

మండలి రద్దు విషయంలో రాజకీయాలకు ఆస్కారం లేదని వెల్లడించారు. రాజ్యాంగబద్ధమైన అంశంగా కేంద్రం చూస్తుందన్నారు. ఎప్పుడు చర్చకు వస్తుందనేది సంబంధిత శాఖలు తెలియచేస్తాయన్నారు. 

రాజధాని విషయంపై ఆయన రెస్పాండ్ అయ్యారు. రాజధానిని ఎక్కడైనా ఏర్పాటు చేసుకొనే అధికారం రాష్ట్రానికి ఉంటుందనే విషయాన్ని కేంద్రం వెల్లడించిందన్నారు. రాజధాని అంశం రాష్ట్రానికి సంబంధించిందని, కేంద్రం ఇందులో జోక్యం చేసుకోలేదని అనేక సందర్భాల్లో తాను చెప్పడం జరిగిందన్నారు. రాజధాని అంశంలో ప్రత్యక్షంగా గాని, పరోక్షంగా గానీ కేంద్రం జోక్యం చేసుకోలేదని స్పష్టం చేసిందన్నారు.