కరోనా వచ్చిందని భయంతో ఆత్మహత్య..నెగిటివ్ గా వచ్చిన రిపోర్ట్

  • Published By: nagamani ,Published On : July 10, 2020 / 11:06 AM IST
కరోనా వచ్చిందని భయంతో ఆత్మహత్య..నెగిటివ్ గా వచ్చిన రిపోర్ట్

Updated On : July 10, 2020 / 1:03 PM IST

రోగం కంటే భయం మా చెడ్డది అనే మాట నేటి కరోనా కాలంలో నిజమని నిరూపిస్తోంది. కరోనా వచ్చిందనే భయంతో ఆత్మహత్యలకు పాల్పడుతున్నఘటనల గురించి వింటున్నాం.ఈ క్రమంలో ఏపీలోని కర్నూలు జిల్లాలో కరోనా వచ్చిందనే భయంతో ఓ వ్యక్తి ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. పోలీసుల కథనం ప్రకారం.. స్థానిక పాతబస్తీ కేవీఆర్ గార్డెన్‌కు చెందిన జాకీర్ అనే వ్యక్తి భార్య, ముగ్గురు కుమార్తెలు, కుమారుడితో కలిసి జీవిస్తున్నాడు. లాక్‌డౌన్ కారణంగా మార్చి నెల నుంచి ఇంట్లోనే ఉంటున్న ఆయన రెండు రోజుల క్రితం అనారోగ్యానికి గురయ్యాడు.

ఓ ప్రైవేటు ఆసుపత్రిలో చేరిన అతడు.. కరోనా భయంతో బుధవారం (జులై 8,2020)ఓ ప్రైవేటు ల్యాబులో పరీక్ష కోసం నమూనాలు ఇచ్చాడు. అతనిపాటే వచ్చిన కుటుంబ సభ్యులు ల్యాబు వద్దే నిలబడి ఉన్నారు. ఇంటికెళ్లటానికి చాలా సమయం పడుతుంది..చాలా చిరాగ్గా ఉంది స్నానం చేసి వస్తానంటూ కుటుంబ సభ్యులకు చెప్పి ఇంటికెళ్లిన అతను ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు.
అలా ఎంతకూ జాకీర్ రాకపోవటంతో కుటుంబ సభ్యులు అతనికి ఫోన్ చేసిన ఫలితం లేదు.దీంతో చూసి చూసి ఇంటికి రాగా ఉరి వేసుకున్నట్లుగా గుర్తించి భోరున విలపించారు.

ఈ విషాద ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు. ఆ తరువాత అతని కరోనా పరీక్షల రిపోర్ట్ వచ్చింది. కానీ అతనికి కరోనా లేదనీ పరీక్షలో నెగటివ్ అని వచ్చినట్టు తెలిసింది. భయంతోనే ఆత్మహత్యకు పాల్పడిన అతను కుటుంబ సభ్యులకు మాత్రం జీవితాంతం తీరని విషాదాన్ని మిగిల్చాడు. ఈ ఘటన స్థానికంగా తీవ్ర విషాదాన్ని నింపింది.కరోనా సోకిందన్న భయంతోనే అతడు తొందరపడి క్షణికావేశంలో ఆత్మహత్య చేసుకున్నట్టు పోలీసులు తెలిపారు.

Read Here>>అమెరికాలోని తెలుగు విద్యార్ధులకు ఏపీ ప్రభుత్వం అండ