గన్నవరం ఎయిర్‌పోర్టులో దట్టంగా పొగమంచు..సిగ్నల్స్ కనిపించక విమానాల ల్యాండింగ్‌కు తీవ్ర ఇబ్బందులు

గన్నవరం ఎయిర్‌పోర్టులో దట్టంగా పొగమంచు..సిగ్నల్స్ కనిపించక విమానాల ల్యాండింగ్‌కు తీవ్ర ఇబ్బందులు

Updated On : February 27, 2021 / 9:58 AM IST

Heavy fog at Gannavaram Airport : కృష్ణా జిల్లా గన్నవరం ఎయిర్‌పోర్టులో దట్టంగా పొగమంచు వ్యాపించింది. దీంతో విమాన సర్వీసులకు అంతరాయం ఏర్పడింది. సిగ్నల్స్ కనిపించకపోవడంతో విమానాల ల్యాండింగ్‌కు తీవ్ర ఇబ్బందులు ఎదురవుతున్నాయి.

గంటన్నర నుంచి విమానాలు గాల్లోనే చక్కర్లు కొడుతుండడంతో ప్రయాణికులు తీవ్ర భయాందోళన చెందుతున్నారు. ఎయిర్‌పోర్టు మొత్తం పొగమంచుతో నిండిపోయింది. ఎక్కడ ఏముందో కనిపించని పరిస్థితి ఏర్పడింది.