AP Weather : ఉత్తరాంధ్రకు భారీ వర్ష సూచన

ఉత్తరాంధ్ర జిల్లాలతో పాటు..తూర్పు గోదావరి జిల్లాల్లో భారీ వర్షాలు పడుతాయని వాతావరణ శాఖ ప్రకటించింది. దక్షిణ ఒడిశా - ఉత్తర ఏపీ తీరాలకు చేరుకుంటుందని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు.

AP Weather : ఉత్తరాంధ్రకు భారీ వర్ష సూచన

Rain

Updated On : October 15, 2021 / 11:26 AM IST

Heavy Rains Likely Uttarandhra : ఉత్తరాంధ్ర జిల్లాలతో పాటు..తూర్పు గోదావరి జిల్లాల్లో భారీ వర్షాలు పడుతాయని వాతావరణ శాఖ ప్రకటించింది. తూర్పు మధ్య బంగాళాఖాతం దాని పరిసర ప్రాంతాల్లో అల్పపీడనం ఏర్పడిన సంగతి తెలిసేందే. దీనికి అనుబంధంగా…ఉపరితల ద్రోణి కూడా ఏర్పడింది. రాగల 24 గంటల్లో దక్షిణ ఒడిశా – ఉత్తర ఏపీ తీరాలకు చేరుకుంటుందని వాతావరణ శాఖ అధికారులు వెల్లడించారు.

Read More : Sai Dharam Tej : మెగా ఫ్యాన్స్‌కి గుడ్ న్యూస్‌.. ‘సాయి ధరమ్ తేజ్’ డిశ్చార్

దీని కారణంగా..సుమారు 40 నుంచి 50 కిలోమీటర్ల వేగంతో గాలులు వీచే అవకాశం ఉందని, అంతేగాకుండా..భారీ వర్షాలు అక్కడక్కడ కురిసే అవకాశం ఉందని తెలిపారు. శ్రీకాకుళం, విశాఖపట్టణం, విజయనగరం, తూర్పు గోదావరి జిల్లాల్లో భారీ వర్షాలు పడే అవకాశం ఉందని తెలిపారు. దక్షిణ కోస్తాంధ్ర, రాయలసీమ ప్రాంతాల్లో మాత్రం తేలికపాటి నుంచి ఓ మోస్తారు వర్షాలు కురిసే అవకాశం ఉందన్నారు.

Read More Bihar Motihari : ప్రిన్స్ పాల్ పోస్టు కోసం కొట్టుకున్నారు..వీడియో వైరల్

సముద్రమట్టానికి 5.8 కి.మీటర్ల మేర ఉపరితల ఆవర్తనం వంగి ఉందని, తూర్పు – పడమర ద్రోణి సగటు సముద్రమట్టం కంటే 4.5, 5.8 కి.మీటర్ల ఎత్తు మధ్య విస్తరించి ఉందని పేర్కొన్నారు. ప్రస్తుతం..ఉపరితల ఆవర్తనం గుండా వెళుతోందని, లక్ష ద్వీప్ ప్రాంతం, ఉపరితల ఆవర్తనం ఆగ్నేయ అరేబియా సముద్రం మధ్య బంగాళాఖాతం ఉత్తర భాగంలో ఉన్న ఇతర అల్పపీడన ప్రాంతంతో సంబంధం ఉందన్నారు.