కొత్త ట్రాఫిక్ రూల్స్.. ఈ తప్పు చేసి దొరికితే రూ.25,000 ఫైన్.. ఏయే తప్పులకు ఎంత ఫైన్.. ఫుల్ డిటెయిల్స్
శనివారం విజయవాడతో పాటు విశాఖలో దీని అమలును షురూ చేశారు.

ఆంధ్రప్రదేశ్‌లో ట్రాఫిక్ నిబంధనలు పాటించకుండా మీ ఇష్టం వచ్చినట్లు వాహనాలు నడిపితే ఇక మీ జేబులకు చిల్లు పడుతుంది. ఏపీలోకొత్త మోటార్ వాహనాల చట్టాన్ని అమలు చేస్తున్నారు.
హైకోర్టు ఆదేశాలతో కేంద్ర సర్కారు ఈ నిబంధనలు తీసుకొచ్చిన విషయం తెలిసిందే. దాన్ని ఏపీలో అమలు చేయడానికి రెడీ అయింది సర్కారు. శనివారం విజయవాడతో పాటు విశాఖలో దీని అమలును షురూ చేశారు.
Also Read: ఐపీఎల్‌ను బహిష్కరించాలట.. భారత్‌పై అక్కస్సు వెల్లగక్కిన పాక్ మాజీ కెప్టెన్ ..
ఇక దశలవారీగా రాష్ట్ర వ్యాప్తంగా అమలు చేస్తారు. బైకు నడిపే వ్యక్తితో పాటు వెనుక కూర్చునే వారు కూడా హెల్మెట్ పెట్టుకోవాల్సిందే. ట్రాఫిక్ నిబంధనలు పాటించాలని పోలీసులు ఎంతగా అవగాహన కల్పిస్తున్నా చాలా మంది అవేమీ పాటించకుండా ఎదుటివారి ప్రాణాలకు కూడా ముప్పు కలిగించేలా ప్రవర్తిస్తున్నారు. దీంతో జరిమానాలను పెంచారు.
ఏ నిబంధన ఉల్లంఘిస్తే ఎంత జరిమానా?
- హెల్మెట్ లేకుండా వాహనం డిపితే: రూ.1,000 (పిలియన్ రైడర్లకు, ట్రిపుల్ రైడింగ్ చేసేవారికి కూడా ఇదే జరిమానా వర్తిస్తుంది)
- సీట్ బెల్ట్ లేకుండా నడిపితే: రూ.1,000
- మద్యం తాగి వాహనం నడిపితే: రూ.10,000 (లైసెన్స్ కూడా రద్దు అయ్యే అవకాశం ఉంది)
- మైనర్ వాహనం నడుపుతూ పట్టుబడితే: రూ.25,000, మూడేళ్ల జైలు శిక్ష కూడా పడే ప్రమాదం ఉంది
- మైనర్ వాహనం నడపడానికి పెద్దలు అనుమతిస్తే: రూ.1,000, మూడు నెలల వరకు జైలు శిక్ష
- డ్రైవింగ్ లైసెన్స్ లేకపోతే: రూ.5,000 జరిమానా, వాహనం స్వాధీనం
- కాలుష్య ధ్రువీకరణ పత్రం లేకపోతే: రూ.1,500
- ఇన్సురెన్స్ లేకపోతే: రూ.2,000, రెండోసారి పట్టుబడితే: రూ.4,000
- రిజిస్ట్రేషన్ రెన్యూవల్ లేకపోతే: రూ.2,000, రెండోసారి పట్టుబడితే రూ.5,000
- డ్రైవింగ్ చేస్తున్నప్పుడు సెల్‌ఫోన్‌లో మాట్లాడితే: రూ.1,500, రెండోసారి పట్టుబడితే రూ.10,000
- వేగంగా, ర్యాష్ డ్రైవింగ్ చేస్తే, సిగ్నల్ జంపింగ్ చేస్తే: రూ.1,000
- రేసింగ్ లేదా స్టంట్‌లు చేస్తే: రూ.5,000, రెండోసారి పట్టుబడితే రూ.10,000