Champions Trophy: ఐపీఎల్‌ను బహిష్కరించాలట.. భార‌త్‌పై అక్కస్సు వెల్లగక్కిన పాక్ మాజీ కెప్టెన్ ..

ఛాంపియన్స్ ట్రోఫీలో ఆతిధ్య పాకిస్థాన్ జట్టు ఘోరంగా వైఫల్యం చెందింది. ఈ క్రమంలో ఆ జట్టు మాజీ కెప్టెన్ బీసీసీఐ, ఐపీఎల్ టోర్నీపై తన అక్కస్సును వెల్లగక్కాడు..

Champions Trophy: ఐపీఎల్‌ను బహిష్కరించాలట.. భార‌త్‌పై అక్కస్సు వెల్లగక్కిన పాక్ మాజీ కెప్టెన్ ..

Inzamam ul Haq

Updated On : March 2, 2025 / 12:30 PM IST

inzamam ul haq: ఛాంపియన్స్ ట్రోఫీ 2025కు పాకిస్థాన్ ఆతిధ్యమిస్తున్న విషయం తెలిసిందే. అయితే, ఆ జట్టు మాత్రం ఘోరంగా వైఫల్యం చెందింది. స్వదేశంలో టోర్నీ జరుగుతున్నా ఏమాత్రం ఆటగాళ్లు తమ సత్తాను చాటలేక పోయారు. దీంతో లీగ్ దశలో కనీసం ఒక్క మ్యాచ్ లోనూ విజయం సాధించలేదు. రెండు మ్యాచ్ లలో ఓటమికాగా.. ఒక మ్యాచ్ వర్షం కారణంగా రద్దయింది. తద్వారా సెమీ ఫైనల్స్ కు పాక్ అర్హత సాధించలేక పోయింది. దీంతో పాకిస్థాన్ జట్టుపై ఆ దేశం ఫ్యాన్స్ మండిపడుతున్నారు. మాజీ క్రికెటర్లుసైతం పాక్ ఆటగాళ్ల తీరును విమర్శిస్తున్నారు. అయితే, పాకిస్థాన్ మాజీ కెప్టెన్ ఇంజమామ్ ఉల్ హక్ మాత్రం భారత్ జట్టుపై తన అక్కస్సు వెల్లగక్కాడు. ఏకంగా ఐపీఎల్ ను టార్గెట్ చేశాడు.

Also Read: Champions Trophy 2025 : సెమీస్ చేరిన ఆనందంలో ఉన్న ఆస్ట్రేలియాకు భారీ షాక్‌.. మిగిలిన జ‌ట్ల‌కు పండ‌గే..

పాకిస్థాన్ ఆతిధ్యమిస్తున్న ఛాంపియన్స్ ట్రోఫీలో భారత్ జట్టు తన మ్యాచ్ లను దుబాయ్ వేదికగా ఆడుతుంది. ఇప్పటికే లీగ్ దశలో రెండు మ్యాచ్ లు ఆడగా.. రెండింటిలోనూ టీమిండియా విజయం సాధించి సెమీ ఫైనల్స్ కు వెళ్లింది. సెమీ ఫైనల్స్ లోనూ విజయం సాధిస్తే మార్చి 9న దుబాయ్ వేదికగా ఫైనల్ మ్యాచ్ లో ఆడుతుంది. అయితే, పాక్ క్రికెట్ బోర్డు, మాజీ క్రికెటర్లు ప్రపంచ క్రికెట్ లో బీసీసీఐ ఆధిపత్యంపై రగిలిపోతున్నారు. ఈ క్రమంలో ఇంజమామ్ ఉల్ హక్ అన్ని దేశాల క్రికెట్ బోర్డులకు, ఆయా జట్ల ఆటగాళ్లకు భారత్ కు వ్యతిరేకంగా కీలక విజ్ఞప్తి చేశాడు.

Also Read: IND vs NZ : భార‌త్‌, న్యూజిలాండ్ హెడ్ టు హెడ్ రికార్డ్స్‌.. చిన్న‌ ట్విస్ట్‌.. ఛాంపియ‌న్స్ ట్రోఫీలో ఆధిప‌త్యం ఎవ‌రిదంటే?

ఇంజమామ్ ఉల్ హక్ ఓ టీవీ షోలో మాట్లాడుతూ.. ప్రపంచంలోని అగ్రశ్రేణి ఆటగాళ్లందరూ వెళ్లి ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) ఆడతారు. చాలా సార్లు విదేశీ ఆటగాళ్లు జాతీయ మ్యాచ్ లకు బదులుగా ఐపీఎల్ మ్యాచ్ లకు ప్రాధాన్యత ఇస్తారు. భారత ఆటగాళ్లు మాత్రం మరే ఇతర లీగ్ లోనూ ఆడరు. అన్ని క్రికెట్ బోర్డులు ఇలా చేయాలి.. మీమీ జట్ల ఆటగాళ్లు ఐపీఎల్ లో ఆడకుండా నిరోధించాలి. అంటూ ఐపీఎల్ పై, బీసీసీఐ ఇంజమామ్ ఉల్ హక్ అక్కస్సు వెళ్లగక్కాడు.

ఐపీఎల్ ప్రారంభంలో పాకిస్థాన్ ఆటగాళ్లు టోర్నీలో పాల్గొనేవారు. ఐపీఎల్ మొదటి ఎడిషన్ లో చాలా మంది పాక్ ప్లేయర్లు ఆయా టీంల తరపున ఆడారు. ముంబైలో జరిగిన ఉగ్రవాద దాడి తరువాత పాకిస్థానీ ఆటగాళ్లను ఐపీఎల్ లో ఆడకుండా నిషేధించారు. ఇదిలాఉంటే.. పాకిస్థాన్ తమ సొంతగడ్డపై జరుగుతున్న ఛాంపియన్స్ ట్రోఫీలో ఘోరంగా విఫలమైతే.. ఆ జట్టును బలోపేతం అయ్యేలా పాకిస్థాన్ క్రికెట్ బోర్డుకు సూచనలు చేయాల్సిన ఇంజమామ్.. ఐపీఎల్, బీసీసీఐపై అక్కస్సు వెల్లగక్కడం క్రికెట్ అభిమానులకు ఆగ్రహాన్ని తెప్పిస్తుంది.