వారిని ఉగ్రవాదుల తరహాలో శిక్షించాలి- తిరుమల లడ్డూ వివాదంపై హీరో సుమన్ సంచలన వ్యాఖ్యలు

దేవుడి ప్రసాదం విషయంలో అలా చేయడం మహా పాపం. అంత సెంటిమెంట్ గా భావించే లడ్డూ ప్రసాదాన్ని అలా చేసిన వారిని వదలొద్దు.

వారిని ఉగ్రవాదుల తరహాలో శిక్షించాలి- తిరుమల లడ్డూ వివాదంపై హీరో సుమన్ సంచలన వ్యాఖ్యలు

Updated On : September 29, 2024 / 10:14 PM IST

Ttd Laddu Row : తిరుమల లడ్డూ వివాదంపై సినీ నటుడు సుమన్ హాట్ కామెంట్స్ చేశారు. దీనిపై ప్రస్తుతం సిట్ విచారణ జరుగుతోందని, లడ్డూ కల్తీ నిజమని తేలితే బాధ్యులను కఠినంగా శిక్షించాలన్నారు. ఉగ్రవాదుల తరహాలో బాధ్యులను శిక్షించాలన్నారు. ఈ ఘటన వల్ల దేశవ్యాప్తంగా ఉన్న కోట్లాది మంది భక్తుల మనోభావాలు దెబ్బతిన్నాయని, ఇలాంటి ఘటనలు మళ్లీ జరగకుండా ప్రభుత్వాలు చర్యలు తీసుకోవాలన్నారు సుమన్.

”అన్ని మతాల్లో.. చర్చి, దర్గా ఉన్నాయి. అక్కడ అన్ని చోట్ల ప్రసాదాలు చేస్తుంటారు. ఇప్పుడు వాళ్ల ఆరోపణ ఏంటంటే.. జంతువుల కొవ్వు కలిసిందని. ఉందని అనుకుంటే అక్కడున్న బోర్డు వాళ్లు ఏం చేశారు? అక్కడున్న అధికారులు ఏం చేశారు? నెయ్యి నాణ్యత చెక్ చేసేందుకు ప్రాసెస్ ఉంటుందని విన్నాను. మరి ట్యాంకర్ నుంచి ఎలా పాస్ అయ్యింది. దీన్ని చాలా జాగ్రత్తగా పరిశీలించాలి. ఎవరైతే తప్పు చేశారో వారిని కఠినంగా శిక్షించాలి. అనుమానం ఒక్కసారి వచ్చాక అది అందరి మీద పోతుంది. వాళ్లు చేశారో లేదో.

Also Read : తిరుమల లడ్డూ వివాదంపై రేపు సుప్రీంకోర్టులో విచారణ.. ఏం జరగనుంది, దేశవ్యాప్తంగా ఉత్కంఠ..

ఒక ఆఫీసులో ఒకరు తప్పు చేస్తే అందరికీ చెడ్డపేరు వస్తుంది. అది తప్పదు. అలా జరక్కూడదు. దేవుడి ప్రసాదం విషయంలో అలా చేయడం మహా పాపం. సినిమాలో వేంకటేశ్వర స్వామి పాత్రను నేను చేశాను. తిరుమలకు ప్రపంచ వ్యాప్తంగా భక్తులు వస్తున్నారు. శ్రీవారి లడ్డూ ప్రసాదం అంటే ఒక సెంటిమెంట్. అంత సెంటిమెంట్ గా భావించే లడ్డూ ప్రసాదాన్ని అలా చేసిన వారిని వదలొద్దు. తప్పు చేసిన వారిని రెండేళ్లు జైల్లో వేసేలా బిల్లు తేవాలి. ఈ నేరం తీవ్రవాదం కంటే ఎక్కువ. తప్పు చేసిన వారిని పట్టుకుని కఠినంగా శిక్షించాలని సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ కు విజ్ఞప్తి చేస్తున్నా” అని సుమన్ అన్నారు.