అమరావతి కేసులపై హైకోర్టు విచారణ.. సెప్టెంబర్ 21వరకు స్టేటస్ కో..

  • Published By: vamsi ,Published On : August 27, 2020 / 12:27 PM IST
అమరావతి కేసులపై హైకోర్టు విచారణ.. సెప్టెంబర్ 21వరకు స్టేటస్ కో..

Updated On : August 27, 2020 / 1:24 PM IST

అమరావతి అంశానికి సంబంధించి రాష్ట్ర ప్రభుత్వానికి సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు చేసిన మరుసటి రోజు అనగా ఈ రోజు(27 ఆగస్ట్ 2020) రాష్ట్ర హైకోర్టులో అమరావతి అంశంపై విచారణ జరిగింది. ఈ సందర్భంగా హైకోర్టులో అమరావతికి సంబంధించిన బిల్లులపైన విచారణ జరిగింది.



రాజధానిని తరలించడానికి అనుమతివ్వాలని ప్రభుత్వం కోరగా రాజధాని అంశాలకు సంబంధించి పిటిషన్లపై హైకోర్టులో విచారణను వచ్చేనెల(సెప్టెంబర్) 21 నుంచి రోజువారిగా ప్రత్యక్షంగా విచారించనున్నట్లు హైకోర్టు ప్రకటించింది. న్యాయవాదులతో హైకోర్టు త్రిసభ్య ధర్మాసనం చర్చలు భౌతికదూరం పాటిస్తే హైకోర్టులో విచారణకు సిధ్ధమని త్రిసభ్య ధర్మాసనం వెల్లడించింది.
https://10tv.in/how-to-withdraw-pf-amount-using-umang-app/
దీంతో సెప్టెంబర్ 21వ తేదీ నుంచి హైకోర్టులో అమరావతి అంశంపై రోజువారీగా విచారణ జరగనుంది. అప్పటివరకు హైకోర్టు విధించిన స్టేటస్ కో ఎత్తివేయలేమని ధర్మాసనం స్పష్టం చేసింది.