జగన్, చంద్రబాబు, పవన్, లోకేశ్, రోజా, కొడాలి నాని, వంశీ.. కీలక నేతల ఫలితంపై తీవ్ర ఉత్కంఠ

ఇటు శ్రీకాకుళం నుంచి అటు అనంతపురం వరకు దాదాపు 34 అసెంబ్లీ నియోజకవర్గాల్లో పోటీ పడుతున్న కీలక నేతల భవితవ్యం ఎలా ఉండబోతోంది?

జగన్, చంద్రబాబు, పవన్, లోకేశ్, రోజా, కొడాలి నాని, వంశీ.. కీలక నేతల ఫలితంపై తీవ్ర ఉత్కంఠ

Updated On : June 3, 2024 / 11:28 PM IST

Ap Elections 2024 : ఏపీ విజేతపై నరాలు తెగే ఉత్కంఠ కొనసాగుతోంది. ఒకవైపు అధికార వైసీపీ మరోవైపు టీడీపీ నేతృత్వంలోని ఎన్డీయే కూటమి.. అధికారం కోసం హోరాహోరీగా తలపడ్డాయి. రాష్ట్రంలో మొత్తం 175 నియోజకవర్గాల్లోనూ అధికార వైసీపీ పోటీ చేసింది. ఇక టీడీపీ కూటమి కూడా సీట్లు సర్దుబాటు చేసుకుని వైసీపీతో తాడోపేడో తేల్చుకునేలా పోటీ ఇచ్చింది. ఇక రాష్ట్రంలో విజేత ఎవరు? అనే ఉత్కంఠ ఒకవైపు కొనసాగుతుండగా.. కొన్ని కీలక నియోజకవర్గాల అంతిమ ఫలితంపై రెండు తెలుగు రాష్ట్రాల్లో విస్తృత చర్చ జరుగుతోంది.

ఇటు శ్రీకాకుళం నుంచి అటు అనంతపురం వరకు దాదాపు 34 అసెంబ్లీ నియోజకవర్గాల్లో పోటీ పడుతున్న కీలక నేతల భవితవ్యం ఎలా ఉండబోతోంది? సీఎం జగన్, టీడీపీ అధినేత చంద్రబాబు, యువనేత లోకేశ్, జనసేనాని పవన్ కల్యాణ్ లో ఎవరికి ఎక్కువ మెజారిటీ వస్తుంది? బీజేపీ చీఫ్ పురంధేశ్వరి, పీసీసీ చీఫ్ షర్మిల ప్రభావం ఎలా ఉండనుంది? అనేది ఏపీ, తెలంగాణలో ఆసక్తికరంగా మారింది. ఏపీలో అసెంబ్లీతో పాటు పార్లమెంట్ స్థానాల్లో పోటీ చేసిన ముఖ్య నేతల భవితవ్యం ఎలా ఉండనుంది? 10టీవీ స్పెషల్ అనాలసిస్..

ఏపీలో ఉత్కంఠ రేపుతున్న హాట్ సీట్స్ ఇవే…

పులివెందుల
వైసీపీ – జగన్
టీడీపీ – బీటెక్ రవీంద్ర
జగన్ రికార్డ్ మెజార్టీపైనే అందరి ఫోకస్

కుప్పం
వైసీపీ – భరత్
టీడీపీ – చంద్రబాబు
చంద్రబాబు మెజార్టీపై అందరి ఫోకస్

టెక్కలి
వైసీపీ – దువ్వాడ శ్రీనివాస్
టీడీపీ – అచ్చెన్నాయుడు
ఇంతవరకు ఓటమి ఎరుగని అచ్చెన్నాయుడు

ఆముదాలవలస
వైసీపీ – తమ్మినేని వీరభద్రం
టీడీపీ – కూన రవికుమార్
మామా అల్లుళ్ల మధ్య టైట్ ఫైట్

చీపురుపల్లి
వైసీపీ – బొత్స సత్యనారాయణ
టీడీపీ – కిమిడి కళా వెంకటరావు
తూర్పుకాపు టాప్ లీడర్ల మధ్య హోరాహోరీ పోరు

గాజువాక
వైసీపీ – గుడివాడ అమర్నాథ్
టీడీపీ – పల్లా శ్రీనివాసరావు
ఉక్కు పరిశ్రమ కార్మికుల ఓట్లే కీలకం

భీమిలి
వైసీపీ – అవంతి శ్రీనివాస్
టీడీపీ – గంటా శ్రీనివాస్
గురుశిష్యుల్లో గెలిచేది ఎవరు?

నర్సీపట్నం
వైసీపీ – పెట్ల ఉమాశంకర్ గణేశ్
టీడీపీ – అయ్యన్నపాత్రుడు
అయ్యప్ప అనుభవమా? ఎమ్మెల్యే గణేశ్ వన్స్ మోరా?

పాయకరావుపేట
వైసీపీ – కంబాల జోగులు
టీడీపీ – వంగలపూడి అనిత
ఉత్కంఠ పోరులో గెలుపెవరిది?

రాజమండ్రి రూరల్
వైసీపీ – చెల్లుబోయిన వేణు
టీడీపీ – బుచ్చయ్యచౌదరి
బుచ్చయ్యకు గట్టి సవాల్ విసిరిన వేణు

పిఠాపురం
వైసీపీ – వంగా గీత
జనసేన – పవన్ కల్యాణ్
పిఠాపురం ఫలితంపై వందల కోట్ల బెట్టింగ్ లు?

దెందులూరు
వైసీపీ – అబ్బయ్య చౌదరి
టీడీపీ – చింతమనేని ప్రభాకర్
గత ఎన్నికల్లో చింతమనేని దూకుడికి చెక్ చెప్పిన అబ్బయ్య చౌదరి

ఉండి
వైసీపీ – పీవీఎల్ నరసింహరాజు
టీడీపీ – రఘురామకృష్ణరావు
ఉండిలో డేంజర్ బెల్స్ మోగిస్తున్న టీడీపీ రెబల్ అభ్యర్థి శివరామకృష్ణ

విజయవాడ వెస్ట్
వైసీపీ – షేక్ ఆసిఫ్
బీజేపీ – సుజనా చౌదరి
తొలిసారి ప్రత్యక్ష ఎన్నికల్లో సుజనా చౌదరి పోటీ

Also Read : ఎగ్జిట్ పోల్స్ నిజం అవుతాయా? తుది ఫలితాలు ఇలాగే ఉంటాయా? తెలకపల్లి రవి విశ్లేషణ..